ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. సోమవారం(ఏప్రిల్ 12) ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో శుభారంభం చేయాలని ఇరుజట్లు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి బలాబలాలు ఓ సారి పరిశీలిద్దాం.
రాజస్థాన్ బోణీ కొట్టేనా?
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, బట్లర్, కెప్టెన్ శాంసన్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. బట్లర్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. శివం దూబే, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్, లివింగ్స్టన్ వంటి ఆటగాళ్లు అటు బంతితోనూ మాయ చేసే సత్తా ఉన్నవాళ్లే. లెగ్ స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవాలని శాంసన్ భావిస్తే గోపాల్‌తో పాటు తెవాతియాకు స్థానం దక్కుతుంది! గాయం కారణంగా లీగ్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆటగాడు ఆర్చర్ స్థానంలో కొత్తగా జట్టులోకి వచ్చిన క్రిస్ మోరిస్.. బౌలింగ్ విభాగాన్ని నడిపించొచ్చు.
తుది 11 మందిలో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలి. దీంతో ముస్తాఫిజుర్ రెహామాన్కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. అనుభవం ప్రకారం చూస్తే కనుక జైదేవ్ ఉనద్కత్‌కు స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కార్తిక్ త్యాగి, చేతన్ సకారియాలలో ఏ ఒక్కరిని సోమవారం నాటి మ్యాచ్‌లో బరిలోకి దింపుతారో వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి:'మిస్టర్ కూల్' ధోనీపై ద్రవిడ్ కోప్పడిన వేళ!
శుభారంభం దక్కేనా?