తెలంగాణ

telangana

By

Published : May 5, 2021, 5:51 PM IST

Updated : May 5, 2021, 10:48 PM IST

ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు

ఆసీస్ ఆటగాళ్లను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్​ను ఇటీవల వాయిదా వేశారు. దీంతో భారత్​లో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చిక్కుకున్నారు.

IPL's Australian players
ఆసీస్​ ఆటగాళ్లు

ప్రత్యేక విమానాల ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లను పంపించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఆ దేశ బోర్డు తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లే చెప్పారు. కరోనా ప్రభావంతో ఐపీఎల్​ నిరవధిక వాయిదా పడింది. దీంతో లీగ్​లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం.. భారత్​ నుంచి వచ్చే విమానాలను నిలిపివేసిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లు.. స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. దీంతో వారిని సురక్షితంగా తమ దేశానికి పంపించే ప్రయత్నాలు చేస్తోంది బీసీసీఐ.

"బీసీసీఐ మా ఆటగాళ్లను పంపించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. మాల్దీవులు లేదా శ్రీలంక మీదుగా చార్టెడ్​ ఫ్లైట్స్​ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తోంది."

-నిక్​ హాక్లే, ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు తాత్కాలిక సీఈఓ.

పదిరోజులు క్వారంటైన్​లో

ఐపీఎల్​లో పాల్గొన్న 11 మంది ఇంగ్లాండ్​ ఆటగాళ్లలో ఎనిమిది మంది తమ స్వదేశానికి బుధవారమే చేరుకున్నారు. వీరిలో బట్లర్​, బెయిర్​ స్టో ఉన్నారు. సారథి​ మోర్గాన్, డేవిడ్​ మలన్​, క్రిస్​ జోర్డాన్​ మరో 48 గంటల్లో బయలుదేరనున్నారు. అయితే భారత్ ​నుంచి వచ్చేవారికి అక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. అక్కడికి చేరుకోగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో పదిరోజులు ఉండాల్సి ఉంటుంది.

మే10 వరకు ఇక్కడే

న్యూజిలాండ్​ క్రికెటర్లు కూడా మే 10వరకు భారత్​లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా కివీస్​ క్రికెటర్లు ఐపీఎల్​ పూర్తికాగానే ఇంగ్లాండ్​తో ఆడేందుకు నేరుగా అక్కడికి వెళ్లాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూకే ప్రభుత్వం మే 10వరకు తమ దేశానికి వచ్చే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. బయట నుంచి వచ్చే తమ దేశ ప్రజలకు(నిబంధనలతో కూడిన) తప్ప ఇతరులకు అనుమతి ఇవ్వలేదు. ఈ కారణంగానే న్యూజిలాండ్​ క్రికెటర్లు సారథి కేన్​ విలియమ్సన్​, బౌల్ట్​, జెమీసన్‌​, షేన్​ బాండ్​, మైక్​ హెసన్​, టిమ్​ సీఫర్ట్​, ఆడమ్ మిల్నే, స్కాట్​, జేమ్స్​ పామెంట్​ ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మే 11న ఇక్కడి నుంచి వారు ఇంగ్లాండ్​కు బయలుదేరుతారు.

ఇదీ చూడండి: 'టీ20 ప్రపంచకప్​పై తుదినిర్ణయం అప్పుడే'

Last Updated : May 5, 2021, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details