ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ బృందంలోని ముగ్గురికి కొవిడ్ సోకింది. దీంతో లీగ్ నిర్వాహకులైన బీసీసీఐ సందిగ్ధంలో పడింది. టోర్నీ సజావుగా సాగాలంటే మిగిలిన మ్యాచ్‌లను ముంబయికి తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని కొవిడ్ ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. అయిప్పటికీ.. ముంబయిలో ప్రారంభ మ్యాచ్‌లు సజావుగా సాగాయి. ప్రపంచ స్థాయి స్టేడియాలు మూడు ఉన్నాయి. దీంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ముంబయే అనుకూలమైన ప్రాంతామని బీసీసీఐ భావిస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.
ఐపీఎల్లో ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్‌లు ముగిశాయి. కోల్‌కతా-బెంగళూరు మధ్య జరగాల్సిన 30వ మ్యాచ్ కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకటైనా దిల్లీ కూడా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ముందుంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు దొరక్క చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇదీ చదవండి:కేఎల్ రాహుల్‌కు శస్త్రచికిత్స విజయవంతం