ఒకప్పుడు ఐపీఎల్ ప్రారంభ వేడుక అంటే రాత్రివేళలో వెలుగుల జిలుగులు, సినీ ప్రముఖుల డాన్స్‌లు, అతిరథ మహారథల సమక్షంలో అట్టహాసంగా మ్యాచ్‌లు జరిగేవి. కరోనా కారణంగా గతేడాది నుంచి ఇలాంటి వేడుకలకు ఐపీఎల్ నిర్వాహాకులు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం దేశమంతా కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో గతంలో లాంటి గ్రాండ్ వేడుకలను నిర్వహించాలంటే కష్టమైన పనే!
ఐపీఎల్ ప్రారంభ వేడుకకు ముఖ్యఅతిథులు వీరే! - బీసీసీఐ వార్తలు
ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ఈసారి దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
శుక్రవారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆరంభ వేడుకలకు ముఖ్యఅతిథులు ఎవరొస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో ప్రారంభ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ ఓపెనింగ్ సెర్మోనీకి తొలిసారి దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్‌కు చెందిన సభ్యులు హాజరుకానున్నారు. ఇదే విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబీఐ) ట్విట్టర్లో వెల్లడించగా.. బీసీసీఐ సెక్రటకీ జైషా రీట్వీట్ చేశారు.