తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ జట్టును కాదని ఐపీఎల్​లో ఆడేందుకు..!

ఐపీఎల్​లో అడేందుకు తమ దేశ క్రికెటర్లకు అనుమతి ఇచ్చినట్లు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు అధికారి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. జాతీయ జట్టులో ఆడేందుకు ఆసక్తి లేని ఆటగాళ్లకు ఎన్​ఓసీ ఇచ్చేందుకు బోర్డు సిద్ధంగా ఉందని ఆయన తెలిపాడు.

Bangladesh board allows players to miss national duty for IPL
జాతీయ జట్టును కాదని ఐపీఎల్​లో ఆడేందుకు..!

By

Published : Feb 20, 2021, 9:54 AM IST

ఐపీఎల్​లో ఆడేందుకు తమ దేశ ఆటగాళ్లను అనుమతించనున్నట్లు బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు (బీసీబీ) అధికారి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. వచ్చే నెలలో శ్రీలంకతో సుదీర్ఘ పర్యటన ఉన్న నేపథ్యంలో ఐపీఎల్​కు తమ క్రికెటర్లను పంపించేందుకు బంగ్లా సిద్ధపడింది.

"ఐపీఎల్​లో పేసర్​ ముస్తఫిజుర్​ రెహమాన్​ పాల్గొనాలనుకుంటే అతడికి ఎన్​ఓసీ ఇచ్చి అనుమతిస్తాం. ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​కు ఇప్పటికే నిరభ్యంతర పత్రాన్ని (ఎన్​ఓసీ) అందించాం. ఎన్​ఓసీ అడిగిన ప్రతి క్రికెటర్​ను అనుమతించేందుకు బోర్డు సిద్ధంగా ఉంది. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడాలని ఆసక్తి లేనప్పుడు వాళ్లను ఒత్తిడి చేయడం సరికాదు".

- అక్రమ్​ ఖాన్​, బీసీబీ క్రికెట్​ ఆపరేషన్స్​ ఛైర్మన్

"షకిబుల్​ హసన్​.. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్​పై దృష్టి సారించాడు. టెస్టుల్లో ఆడాలని తాను అనుకోవడం లేదు. అతడు ఐపీఎల్​లో ఆడేందుకు బోర్డును అనుమతి కోరాడు. టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తి లేని కారణంగా అతడికి ఎన్​ఓసీ ఇచ్చేందుకు బోర్డు అంగీకరించింది" అని ఓ బంగ్లాదేశ్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీసీబీ అధికారి అక్రమ్​ ఖాన్​ వెల్లడించాడు.

అయితే, ముస్తఫిజుర్​ రెహమాన్​కు ఎన్​ఓసీ ఇచ్చేందుకు బంగ్లా బోర్డు తొలుత తిరస్కరించింది. ప్రస్తుత ఐపీఎల్​లో రెహమాన్​తో పాటు ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​ (ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు) మాత్రమే పాల్గొంటారు.

ముస్తఫిజుర్​ రెహమాన్​ను కోటి రూపాయలకు రాజస్థాన్​ రాయల్స్​ వేలంలో సొంతం చేసుకోగా.. ఆల్​రౌండర్ షకిబుల్​ హసన్​ను రూ.3.2 కోట్లకు కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు దక్కించుకుంది.

ఇదీ చూడండి:ముంబయి ఇండియన్స్‌ పట్టిన మరో బంగారం?

ABOUT THE AUTHOR

...view details