చెన్నై వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 38 పరుగుల తేడాతో గెలుపొందింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ సేన 166 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్ 3, హర్షల్ పటేల్, చాహల్ రెండేసి వికెట్లతో రాణించారు. ఈ విజయంతో కోహ్లీ సేన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
బెంగళూరు హ్యాట్రిక్ విన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
చెన్నై వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సేన 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో మోర్గాన్ సేన 166 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది ఆర్సీబీ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్కతా నైట్ రైడర్స్, బెంగళూరు హ్యాట్రిక్ విన్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
శుభ్మన్ గిల్(21 పరుగులు), రాహుల్ త్రిపాఠి(25 పరుగులు), ఇయాన్ మోర్గాన్(29 పరుగులు), షకిబుల్ హసన్(26) ఓ మోస్తారుగా రాణించారు. చివర్లో ఆండ్రీ రస్సెల్(31) రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Last Updated : Apr 18, 2021, 7:31 PM IST