ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై స్వదేశానికి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌ను వీడుతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఫ్రాంఛైజీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
ఇప్పటికే గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ జట్టుకు దూరమవగా.. ఇటీవల లియామ్ లివింగ్‌స్టోన్ బబుల్ నుంచి వెళ్లిపోయాడు. కేకేఆర్‌తో మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కర ఈ విషయాన్ని ప్రకటించాడు.
"వ్యక్తిగత కారణాలతో ఆండ్రూ టై ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతనికి అన్ని విధాల మా మద్దతు ఉంటుంది." -రాజస్థాన్ రాయల్స్ ట్వీట్