దిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌కు విరామం ప్రకటించాడు. తన కుటుంబ కరోనా బారిన పడిందని.. అందుకే వారికి తోడుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ జరిగాక ఈ విషయం చెప్పాడు. పరిస్థితులు చక్కబడితే తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు.
ఐపీఎల్‌కు అశ్విన్ బ్రేక్.. కారణమిదే - రవిచంద్రన్ అశ్విన్ కరోనా
తన కుటుంబం కరోనా బారిన పడిందని తెలిపిన దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వారికి తోడుగా ఉండేందుకు ఈ ఐపీల్లో నుంచి మధ్యలోనే వైదొలుగుతున్నట్లు తెలిపాడు. పరిస్థితులు చక్కబడితే తిరిగివస్తానని చెప్పాడు.
అశ్విన్
చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 పరుగులే చేయగా అనంతరం పంత్ సేన ఆ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.