తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో అది భారత్​కు పెద్ద దెబ్బ' - sunil gavaskar on hardik pandya

ఐపీఎల్‌లో (ipl 2021 news) ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ (hardik in ipl 2021) చేయకపోవడంపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించాడు.

sunil gavaskar on ipl
భారత జట్టుకు పెద్ద దెబ్బ

By

Published : Oct 6, 2021, 9:33 AM IST

ఐపీఎల్‌(IPl 2021 News)లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకపోవడం (hardik pandya ipl 2021) భారత జట్టుకు పెద్ద దెబ్బ అని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉన్న పాండ్యా.. ఐపీఎల్‌లో (hardik pandya ipl 2021) ముంబయి ఇండియన్స్‌ తరఫున బౌలింగ్‌ చేయని (sunil gavaskar on ipl 2021) నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.

"హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం బౌలింగ్‌ చేయకపోవడం కేవలం ముంబయి ఇండియన్స్‌కు మాత్రమే కాదు భారత జట్టుకు కూడా పెద్ద దెబ్బే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌కు అతడిని ఆల్‌రౌండర్‌ కోటాలో ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో 6, 7 స్థానాల్లో దిగి.. బౌలింగ్‌ చేయకపోతే ఏ కెప్టెన్‌కైనా చాలా కష్టం. దిగువ స్థానాల్లో వచ్చి బౌలింగ్‌ చేయకపోతే ఏ సారథికైనా ప్రత్యామ్నాయాలు ఉండవు" అని సన్నీ చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లో రాణించకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమే అని గావస్కర్‌ అన్నాడు. "భారత జట్టుకు ఎంపికైన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ కొంచెం విశ్రమించినట్లుగా కనిపిస్తున్నారు. తాము భారత ఆటగాళ్లు కాబట్టి భారీ షాట్లు ఆడాలి అన్నట్లుగా ఉంది వారి బ్యాటింగ్‌ శైలి" అని సన్నీ పేర్కొన్నాడు.

ఇదేం అంపైరింగ్‌?: ఐపీఎల్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయని గావస్కర్‌ (gavaskar responds on umpiring) విమర్శించాడు. సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌-దిల్లీ క్యాపిటల్స్‌(csk vs dc 2021)తో మ్యాచ్‌లో దిల్లీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌లో అంపైర్‌ అనిల్‌ చౌదరి మొదట నోబాల్‌ ఇచ్చి తర్వాత మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుని వైడ్‌గా ప్రకటించాడు. ఈ ఉదంతంపై గావస్కర్‌ స్పందించాడు. "డ్వేన్‌ బ్రావో వేసిన బంతి కచ్చితంగా నోబాల్‌. కానీ అంపైర్‌ దాన్ని మొదట నోబాల్‌ అని, తర్వాత వైడ్‌గా ప్రకటించాడు. ఇదొక్కటే కాదు ఈ ఐపీఎల్‌లో ఇలాంటి ఉదంతాలు ఒకటికి రెండుసార్లు జరిగాయి. ఇవే మ్యాచ్‌ ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఐపీఎల్‌ స్థాయి టోర్నీల్లో ఇలాంటివి జరగకూడదు. అయితే తప్పుడు నిర్ణయం వచ్చినా అదృష్టవశాత్తూ దిల్లీ గెలవడం ఊరటనిచ్చే విషయం" అని సన్నీ అన్నాడు.

ఇదీ చదవండి:Varun Chakravarthy News: బీసీసీఐకి 'వరుణ్‌' తలనొప్పి

ABOUT THE AUTHOR

...view details