ఈ ఐపీఎల్ సీజన్(IPL 2021 News)లో ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021) ప్రదర్శన చూసి బాధపడనని ఆ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ(akash ambani ipl 2020) అన్నారు. వరుసగా రెండేళ్లు ఛాంపియన్స్‌గా నిలిచిన రోహిత్‌సేన ఈసారి త్రుటిలో ప్లేఆఫ్స్(mumbai indians playoffs) అవకాశాన్ని కోల్పోయింది. లీగ్ దశలో కోల్‌కతాతో సమానంగా 14 పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌రేట్ లేకపోవడం వల్ల ఐదో స్థానానికి పరిమితమైంది. దీంతో కోల్‌కతా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టు(mumbai indians team 2021)తో ఆకాశ్ మాట్లాడిన వీడియోను ఆ ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
'నాలుగేళ్లలో మూడు ట్రోఫీలు ఆషామాషీ కాదు' - ఆకాశ్ అంబాని ఐపీఎల్ 2021
రెండేళ్లుగా ఛాంపియన్‌గా నిలిచి ఈసారి కూడా ఐపీఎల్(IPL 2021 News) టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలకుకున్న ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021) కల నెలవేరలేదు. ఈ నేపథ్యంలో ముంబయి ప్రదర్శనపై స్పందించారు ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ. జట్టు ప్రదర్శనతో బాధపడాల్సిన అవసర లేదని తెలిపారు.
!['నాలుగేళ్లలో మూడు ట్రోఫీలు ఆషామాషీ కాదు' Akash Ambani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13321044-6-13321044-1633925044658.jpg)
"ఈ నాలుగేళ్లలో (2017-2021) మూడుసార్లు ట్రోఫీలు సాధించడం అంత ఆషామాషీ కాదు. ఇక రాబోయే రెండేళ్లు కూడా ఎలా ఆడతామనే విషయంపై మాకు ఎంతో నమ్మకం ఉంది. అలాగే ఈ సీజన్ ఫలితాలు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పటికే అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదిగాం. మీ అందరికీ కృతజ్ఞతలు. ముంబయి ఇండియన్స్ తరఫున ప్రతి ఒక్కరు సమష్టిగా రాణించారు. ఇలాంటి జట్టుని కలిగి ఉండటం మా అదృష్టం. మీరంతా ఒక కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్‌లో ఎవరు ఎక్కడ ఉంటారనేది పక్కనపెడితే ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021) మిమ్మల్ని ఎప్పుడూ ఒకేలా చూస్తుంది" అని ఆకాశ్(akash ambani ipl 2020) తన జట్టుకు అండగా నిలిచాడు.
రోహిత్ శర్మ(rohit sharma news) సారథ్యంలోని ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021) 2013 నుంచి 2019 వరకు ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగుసార్లు టైటిల్ సాధించింది. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి ఐదోసారి విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఈసారి కూడా ఛాంపియన్స్‌గా అవతరించి హ్యాట్రిక్ సాధిస్తుందని అభిమానులు ఆశించగా.. నిరాశపర్చింది. పలు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది.