బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంలో రెండు వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు అభిషేక్ శర్మ. దీనిపై స్పందించిన సన్‌రైజర్స్ మరో ఆటగాడు స్పిన్నర్ రషీద్ ఖాన్.. అభిషేక్‌పై ప్రశంసలు కురిపించాడు. టీమ్ఇండియాకు భవిష్యత్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"భవిష్యత్‌లో టీమ్ఇండియాకు నికార్సయిన ఆల్‌రౌండర్‌గా ఎదుగుతావు. నీకు చాలా సామర్థ్యం ఉంది. నీవు కష్టపడితే విజయాలను అందుకుంటావు" అని రషీద్ ప్రశంసించాడు.