ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం (అక్టోబర్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల(SRH vs RCB head to head) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News Latest). ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
"ఓ జట్టు టాప్-2లో స్థానం కోసం ప్రయత్నిస్తుండగా మరో జట్టు ఇక ఆడలేం ఇంటికి వెళ్లాలి అన్నట్లు ఎదురుచూస్తోంది. హైదరాబాద్ జట్టుకు వీసాలు, బోర్డింగ్ పాసులు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు శారీరకంగానే టోర్నీలో ఉన్నారు. మానసికంగా ఇంటికి వెళ్లి చాలా సమయం అవుతోంది."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.