ఐపీఎల్ 2021(IPL 2021 News)లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. అయితే సీఎస్కే ప్రదర్శన ఎలా ఉన్నా.. కెప్టెన్ ధోనీ(ms dhoni news) మాత్రం బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. దీంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యాత ఆకాశా చోప్రా(akash chopra commentary) మహీ ఆటతీరును ట్రోల్ చేశాడు.
"ప్రస్తుతం ధోనీ(ms dhoni news) ఓ కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రమే జట్టుకు సేవలందిస్తున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్లో అతడు దిగువన దిగుతున్నాడు. కొన్ని సార్లు బ్యాటింగ్ వచ్చినా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనిని బట్టి గమనిస్తే ప్రస్తుతం చెన్నై 10 మంది ప్లేయర్స్, ఓ కెప్టెన్‌తో ఆడుతోంది."