ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై విమర్శల తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేశాడు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్. తన మాటలతో ఎవరినైనా నొప్పించిఉంటే క్షమించాలని కోరాడు. ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడడం తన ఉద్దేశం కాదని తెలిపాడు.
"నాతో పాటు మరి కొంతమంది ఆటగాళ్లకు ఐపీఎల్‌లో కెరీర్ ఏమంత అద్భుతంగా లేదు. ఐపీఎల్‌ను అవమానపరచడం, తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతర లీగులతో ఏమాత్రం పోల్చడం లేదు. నా మాటలు నొప్పించిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నా".
- డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా పేసర్