తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫస్ట్​ వీకెండ్​లో IPL అదుర్స్​​.. 147 కోట్ల వ్యూస్​తో రికార్డ్​లు బ్రేక్​!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్​ సరికొత్త రికార్డును నమోదు చేసింది. తొలి వీకెండ్​ వరకు జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లకు అక్షరాల 147 కోట్ల వీడియో వ్యూస్​ను రాబట్టింది.

147 crore views for ipl 2023 in first weekend
ఐపీఎల్​2023కి మొదటి మూడు రోజుల్లోనే 147 కోట్ల వ్యూస్​

By

Published : Apr 3, 2023, 3:41 PM IST

Updated : Apr 3, 2023, 4:25 PM IST

క్రికెట్​ ఫ్యాన్స్​ ఎంతో ఇష్టపడే ఐపీఎల్​ 16వ సీజన్.. అరుదైన రికార్డును నమోదు​ చేసింది. లీగ్​ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే అక్షరాల 147 కోట్ల వీడియో వ్యూస్​ను సంపాదించింది. ఈ 16వ సీజన్​ ప్రసార హక్కులను డిజిటల్​ ప్లాట్​ఫామ్​ జియో దక్కించుకుంది. జియో సినిమాలో ఫ్రీగా ఈ మెగా లీగ్ చూసే అవకాశం రావడంతో అభిమానులు ఎగబడి మరీ చూశారు. ఇలా ఒకేసారి ఇన్ని కోట్లలో వ్యూస్​ రావడం ఒక విశేషం అయితే.. ఒక్కో మ్యాచ్​ను ఒక వ్యక్తి​ సగటున 57 నిమిషాలు పాటు చూడటం కూడా మరో రికార్డు. 147 కోట్ల వ్యూస్​ అనేది గత సీజన్ మొత్తం కలిపి డిజిటల్ ప్లాట్‌ఫామ్​పై వచ్చిన వ్యూస్ కంటే కూడా ఎక్కువే.

ఐపీఎల్​ 15వ సీజన్​ తొలి వారాంతంతో పోలిస్తే ఈసారి జియో సినిమా యాప్​లో ప్రతి మ్యాచ్​పై ఒక వ్యూయర్​ గడిపిన సమయం 60 శాతానికి పెరిగింది. కాగా, ఈ సీజన్​ తొలి వీకెండ్​లో ఐదు మ్యాచ్​లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్​లకు కలిపి వచ్చిన వీడియో వ్యూస్​ 147 కోట్లు. దీంతో ఐపీఎల్​ చరిత్రలోనే ఈ వ్యూవర్​షిప్​ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

వేల కోట్లు వెచ్చించి.. ఫ్రీగా..
వేల కోట్లు వెచ్చించి ఐదేళ్ల పాటు డిజిటల్​ ప్రసార హక్కులను దక్కించుకుంది రిలయన్స్​ కంపెనీ. కానీ, ఐపీఎల్​ మ్యాచ్​లను మాత్రం జియో సినిమాలో ఉచితంగా చూసే వీలును కల్పించింది సంస్థ. ఎటువంటి సబ్​స్క్రిప్షన్​ లేకపోవడంతో జనాలు కూడా యథేచ్ఛగా ఐపీఎల్​ మ్యాచ్​లు చూస్తున్నారు. మరోవైపు లీగ్​ ప్రారంభమైన తొలి మూడు రోజుల్లోనే 5 కోట్ల జియో సినిమా యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు క్రికెట్​ లవర్స్​.

మార్చి 31న ఐపీఎల్ ప్రారంభమైన తొలి రోజే ఏకంగా 2.5 కోట్ల మంది జియో సినిమా యాప్​ను డౌన్‌లోడ్ చేసుకున్నారని సంస్థ తెలిపింది. దీంతో ఒక రోజులోనే అత్యధిక డౌన్‌లోడ్స్ అయిన యాప్​గా జియో సినిమా రికార్డు సృష్టించింది. ప్రత్యేకించి ఐపీఎల్ కోసం జియో సినిమా యాప్​లో అనేక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. ఐపీఎల్​ ముగిసే వరకూ ప్రతి వారం ఓ నయా ఫీచర్​ను యాడ్ చేసే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అయితే ఈ ప్రీమియర్​ లీగ్​కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్​ ఉంటుంది. ప్రతి లీగ్​కు దీన్ని వీక్షించే వాళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నారు. ఇన్ని కోట్ల వ్యూస్​ రావడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి క్రికెట్​ అంటే ఎంతో ఇష్టంతో చూసే వాళ్ల ద్వారా ఎక్కువ వ్యూస్​ వస్తుండగా.. ఇంకొందరు వీటిపై బెట్టింగ్​ కారణంగా ఐపీఎల్​ మ్యాచ్​లను చూస్తున్నారన్నది వాస్తవం.

12 భాషల్లో లైవ్​..
తెలుగు, హిందీ, ఇంగ్లీష్​, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒరియా, బంగాలీ, భోజ్​పురి, గుజరాతీ, మరాఠీ సహా మొత్తం 12 భాషల్లో జియో సినిమా అభిమానులకు ఐపీఎల్​ లైవ్​ అందిస్తోంది.

Last Updated : Apr 3, 2023, 4:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details