తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!

వాయిదా పడిన ఐపీఎల్​ 14వ సీజన్​ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్​ 18 లేదా 19న లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఫైనల్​ మ్యాచ్​ను అక్టోబర్​ 9 లేదా 10వ తేదీలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ipl, bcci
ఐపీఎల్, బీసీసీఐ

By

Published : May 25, 2021, 6:03 PM IST

Updated : May 25, 2021, 6:35 PM IST

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్​ 14వ సీజన్​ను యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 18 లేదా 19 తేదీలలో తిరిగి నిర్వహించనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ మూడు వారాలలోనే 31 మ్యాచ్​లు జరపనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 10 రోజులు రెండేసి మ్యాచ్​లు నిర్వహించనున్నట్లు సమాచారం.

"బీసీసీఐ అన్ని ఫ్రాంఛైజీలతో మాట్లాడింది. ఐపీఎల్​ను సెప్టెంబర్​ మూడో వారంలో తిరిగి ప్రారంభించాలనుకుంటోంది. 18న శనివారం.. 19న ఆదివారం. ఏదేమైనా వీకెండ్​ తేదీలోనే లీగ్​ను ప్రారంభించనున్నాం. అదే విధంగా, ఫైనల్ మ్యాచ్​ను కూడా వీకెండ్​లోనే నిర్వహిస్తాం. అందుకు అక్టోబర్ 9 లేదా 10 తగిన తేదీ కావొచ్చు. ఇందులో 10 రోజుల్లో రెండేసి చొప్పున మ్యాచ్​లు జరుపుతాం. మిగిలిన 11 మ్యాచ్​లు(రెండు క్వాలిఫయర్స్, ఒక ఎలిమినేటర్, ఒక ఫైనల్) సాయంత్రం ప్రారంభమవుతాయి."

-బీసీసీఐ అధికారి.

"ఇంగ్లాండ్​ పర్యటన సెప్టెంబర్ 14న ముగుస్తుంది. తర్వాత రోజే టీమ్​ఇండియా ఆటగాళ్ల (హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్ మినహా)తో పాటు లీగ్​లో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్లు దుబాయ్​కు చేరుకుంటారు. 'బబుల్​ నుంచి బబుల్'​ నిబంధనలో భాగంగా అక్కడికి చేరుతారు" అని ఆ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి:సుశీల్​.. రాత్రంతా కన్నీరు- భోజనానికి నిరాకరణ

దక్షిణాఫ్రికాతో సిరీస్ రద్దు..

బీసీసీఐ తాజా నిర్ణయంతో దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్​లో తలపెట్టిన టీ20 సిరీస్​ను రద్దు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఐపీఎల్​ అనంతరం టీ20 ప్రపంచకప్​కు ముందు కేవలం పది రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో సిరీస్ నిర్వహణ కష్టమని.. అందుకే రద్దు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

కివీస్​తో టెస్టు సిరీస్ కూడా..

స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ ముగిసిన తర్వాత కివీస్​తో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ, ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితుల వల్ల టీ20 వరల్డ్​కప్​ తేదీలు ఇంకా నిర్ణయించలేదు. దీంతో ఆ సిరీస్​ను కూడా వాయిదా వేయాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇదీ చదవండి:కెరీర్​లో తొలి మ్యాచ్​- నా సలహాతోనే సక్సెస్​!

Last Updated : May 25, 2021, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details