IPL 2022 venue ganguly: ఈ సీజన్ ఐపీఎల్ వేదికపై వస్తోన్న సందేహాలకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెరదించాడు. టోర్నీ మొత్తం స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు. అయితే కరోనా కేసుల పెరుగుదల అంశంపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని వెల్లడించాడు.
"ఈ ఏడాది ఐపీఎల్ భారత్లోనే నిర్వహిస్తాం. అయితే కరోనా విజృంభణ తారస్థాయికి చేరనంత వరకే. మహారాష్ట్రలోని ముంబయి, పుణెలో మ్యాచులు నిర్వహిస్తాం. నాకౌట్ దశకు త్వరలోనే వేదికను ఖరారు చేస్తాం."
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.