తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: వీరి ఆట చూసి తీరాల్సిందే! - ipl 15

IPL 2022: సుమారు రెండు నెలల పాటు సాగే క్రికెట్​ పండుగ.. ఐపీఎల్​ కోసం భారతదేశంతో పాటు యావత్​ క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత ఆటగాళ్లతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రధాన ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఈసారి ఐపీఎల్​లో ఆయా జట్లకు కీలకంగా మారనున్న పలువురు విదేశీ ఆటగాళ్లు ఎవరో చూడండి.

ipl foregin players
ఐపీఎల్​ విదేశి ఆటగాళ్లు

By

Published : Mar 11, 2022, 4:57 AM IST

IPL 2022: క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022.. మార్చి 26న ప్రారంభం కానుంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్​ను కూడా మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్​ ఆటగాళ్ల ప్రదర్శన చూసేందుకు ఫ్యాన్స్​ ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్​లో ఒక్క ఆటగాడి ప్రదర్శనతో మ్యాచ్​ మలుపు తిరుగుతుంది. అలా ఒంటి చేత్తో మ్యాచ్​ ఫలితాన్నే మార్చేయగల సత్తా ఉన్న పలువురు విదేశీ క్రికెటర్లపై ఓ లుక్కేయండి.

1.ఫాఫ్​ డుప్లెసిస్​(Faf Duplesis)

ఫాఫ్​ డుప్లెసిస్​

2021 ఐపీఎల్​లో చైన్నై జట్టు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఫాఫ్​ డుప్లెసిస్​. దక్షిణాఫ్రికాకు చెందిన డుప్లెసిస్​ గత ఐపీఎల్​లో అత్యధిక పరుగులు సాధించిన విదేశీ ఆటగాడు. ఈ ఏడాది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గతేడాది డుప్లెసిస్ చేసిన ప్రదర్శన పునరావృత్తం కావాలని ఆర్​సీబీ ఆశిస్తోంది.

2.గ్లెన్​ మ్యాక్స్​వెల్(Glenn Maxwell)

గ్లెన్​ మ్యాక్స్​వెల్

గతేడాది అద్భుత ప్రదర్శన చేయడం వల్ల మ్యాక్స్​వెల్​ను రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్​సీబీ) రిటెయిన్ ​చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇతడు 2021 ఐపీఎల్​లో 500 పైగా పరుగులు చేశాడు. అదే ప్రదర్శనను కొనసాగించి ఆర్​సీబీ తొలి కప్పు గెలిచేలా కృషి చేస్తాడో చూడాలి.

3. మొయిన్​ అలీ(Moeen Ali)

మొయిన్​ అలీ

ఇంగ్లాండ్​కు చెందిన ఆల్​రౌండర్​ మొయిన్​ అలీనీ చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు మెగావేలానికి ముందే రిటెయిన్​ చేసుకుంది. గత ఐపీఎల్​ సీజన్​లో అలి 357 పరుగులు చేసి కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అదే జోష్​ను కొనసాగించాలని అతడు భావిస్తున్నాడు.

4. క్వింటన్​ డికాక్​(Quinton Decock)

క్వింటన్​ డికాక్​

ముంబయ్​ ఇండియన్స్​ తరఫున అత్యధిక పరగులు చేసిన ఆటగాడు క్వింటన్ డికాక్​. ఈ ఏడాది డికాక్​.. కొత్త జట్టు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ జెర్సీలో కనపడనున్నాడు. గతేడాది అతడు 297 పరగులు చేయగా.. మరోసారి తన పరుగుల దాహాన్ని తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

5. కేన్​ విలియమ్సన్​(Kane williamson)

కేన్​ విలియమ్సన్​

ఐపీఎల్​ 2022లో కేన్​ విలియమ్సన్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గతేడాది ఐపీఎల్​లో 266 పరుగులతో కేన్​ మంచి ఆటతీరు కనపరిచాడు. అయితే జట్టు ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. తనతో పాటు జట్టు కూడా ఈ సారి మరింత మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తున్నాడు కేన్.

6. జోస్​ బట్లర్​(Jos Buttler)

జోస్​ బట్లర్​

గతేడాది ఏడు మ్యాచులే ఆడిన బట్లర్​ 200పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ ఇంగ్లాండ్​ వికెట్​ కీపర్​ను రాజస్థాన్​ రాయల్స్​ యాజమాన్యం రిటెయిన్ చేసుకుంది. బట్లర్​కు​ ప్రత్యర్థి బౌలింగ్​ అటాక్​ను ఒంటి చేత్తో ఎదుర్కొగల సత్తా ఉంది.

7. జానీ బెయిర్​స్టో(Jhony Bairstow)

జానీ బెయిర్​స్టో

2021 ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ఆడిన బెయిర్​స్టో ఈ ఏడాది పంజాబ్​ కింగ్స్​ జట్టులో ఆడనున్నాడు. ఇంగ్లాండ్​కు చెందిన బెయిర్​స్టోకు భారీ షాట్లు కొట్టగలిగే సామర్థ్యం ఉంది. తొలి మ్యాచ్​ నుంచి విజృంభించి ఆడాలని పంజాబ్​ కోరుకుంటుంది.

మరి ఈసారి జరగబోయే ఐపీఎల్​లో ఈ విదేశీ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఇదీ చదవండి:Rohit Sharma: 'రోహిత్‌ను మించిన సారథి లేడు'

ABOUT THE AUTHOR

...view details