IPL title sponsership: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా బీసీసీకి రూ.800 కోట్లు ఆదాయం సమకూరనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన 2008 నుంచి టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా ఇంత భారీ ఆదాయం పొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2022 ఐపీఎల్ సీజన్‌కు టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఏడాదికి రూ.335 కోట్లు చొప్పున రెండేళ్లపాటు స్పాన్సర్‌గా ఉండనుంది. గతేడాది వరకు వివో గ్రూప్ ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఐపీఎల్ సెంట్రల్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ రూపేతో రూ.42 కోట్లు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌తో రూ.44 కోట్ల ఒప్పందాన్ని పూర్తి చేసిందని సమాచారం. దీంతో మొత్తం రూ.800 కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌తో బీసీసీఐకి రూ.వందల కోట్ల ఆదాయం! - లక్నో సూపర్‌జైంట్స్
IPL title sponsership 2022: ఐపీఎల్ 2022 టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా బీసీసీఐ రూ.వందల కోట్లు ఆర్జించనున్నట్లు తెలుస్తోంది. 2008 తర్వత ఇది అత్యధికమని సమాచారం. ఐపీఎల్ 2022 సీజన్లో తొమ్మిది బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉండనున్నాయి.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్
ఐపీఎల్ 2022 సీజన్ మార్చి26న మొదలై మే29తో ముగుస్తుంది. ఈ సారి లక్నో సూపర్‌జైంట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ఈ సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో టీమ్ లీగ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.
ఇదీ చదవండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్‌పై భారీ విజయం
Last Updated : Mar 12, 2022, 5:55 PM IST