చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తదుపరి కెప్టెన్(CSK next captain after Dhoni) ఎంపికపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్. ఎంఎస్ ధోనీ నుంచి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించడానికి డుప్లెసిస్ సరైనోడు అని అన్నాడు.
2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేకు కెప్టెన్‌గా చేస్తున్న ధోనీ.. జట్టును 14వ సీజన్ వరకు అత్యంత విజయంగా నడిపించాడు. తన సారథ్యంలో సీఎస్కేను తొమ్మిదిసార్లు ఫైనల్స్‌కు చేర్చాడు. నాలుగు సార్లు కప్ గెలుచుకున్నాడు. అందులో ఐపీఎల్ -2021 టైటిల్ కూడా ఉంది. అయితే తన చివరి టీ20 మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతానని ఇటీవల చెప్పాడు. దీంతో ధోనీ(ms dhoni ipl retirement) మరో సీజన్ సీఎస్కే సారథిగా కొనసాగుతాడా లేదా అన్నది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. సీఎస్కేకు ధోనీ తర్వాత కెప్టెన్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ తరుణంలో ధోనీ వారసుడిగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ సరిపోతాడని డౌల్ అన్నాడు. ఐపీల్లో గత రెండు సీజన్లలో డుప్లెసిస్ బ్యాటుతో చెలరేగిపోయాడు. జట్టుకు కావాల్సిన సమయంలో రాణించాడు. 14వ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్ 633 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
"ధోనీ తన చివరి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో డుప్లెసిస్ కెప్టెన్సీ(CSK next captain after Dhoni) బాధ్యతలు చేపతాడు. అదే నా అభిప్రాయం. ధోనీ ఆ సీజన్ మొత్తం ఆడుతాడని నేను భావించట్లేదు. అయితే చెన్నైలోనే ధోనీ చివరి ఐపీఎల్ టీ20 మ్యాచ్‌ను ప్రకటిస్తారు. అక్కడ నుంచి డుప్లెసిస్ బాధ్యతలు స్వీకరిస్తాడు" అని సైమన్ డౌల్ అన్నారు.