IPL New Rule :ఐపీఎల్ 2024 సీజన్ నుంచి బీసీసీఐ టోర్నీలో కొత్త నిబంధన తీసుకురాన్నట్లు తెలుస్తోంది. ఇకపై ఒక ఓవర్లో బౌలర్ అత్యధికంగా రెండు బౌన్సర్లు సంధించవచ్చు. ఇదివరకు ఓవర్లో ఒకే బౌన్సర్‌ను అనుమతించేవారు. ఇక అదే ఓవర్లో మరో బంతిని బౌన్సర్‌గా సంధింస్తే, దానిని వైడ్‌గా ప్రకటించేవారు. తాజా రూల్‌తో ఇప్పటినుంచి బౌలర్లకు ఆ సమస్య లేదు. స్వేచ్ఛగా రెండు బౌన్సర్లు వేసుకోవచ్చు. అయితే బ్యాటర్- బౌలర్ మధ్య పోటీని పెంచే ఉద్దేశంతోనే ఈ రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఈ నిబంధనను అమలు చేసింది బీసీసీఐ.
ఇక ఈ రూల్ బౌలర్లకు బాగా కలిసొస్తుందని టీమ్ఇండియా స్టార్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ తెలిపాడు. 'ఈ రూల్ వల్ల క్రీజులో బౌన్సర్లు ఎదుర్కొనడానికి బ్యాటర్లు మరింత కష్టపడాలి. ఇదివరకు ఓవర్లో ఒకే బౌన్సర్ అన్న ధీమాతో బ్యాటింగ్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. క్రికెట్లో ఇది చిన్న మార్పే అయినా, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రూల్ బౌలర్లకు ఓ ఆయుధం లాంటిది. ఇలాంటి రూల్ ఉండడం ఇంపార్టెంట్ అని ఓ బౌలర్‌గా నా భావన' అని ఉనాద్కత్ అన్నాడు.