తెలంగాణ

telangana

ETV Bharat / sports

అన్​క్యాప్​డ్​ ప్లేయర్​పై కాసుల వర్షం.. ఎవరీ ముకేశ్​ కుమార్​

ఐపీఎల్​ మినీ వేలంలో ఓ అన్​క్యాప్​డ్​ ప్లేయర్​పై కాసుల వర్షం కురిసింది. అతడి పేరే ముకేశ్​ కుమార్​. అసలు ఎవరితడు?​

IPL Mini auction 2023 Mukesh kumar
అన్​క్యాప్​డ్​ ప్లేయర్​పై కాసుల వర్షం.. ఎవరీ ముకేశ్​ కుమార్​

By

Published : Dec 23, 2022, 7:33 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ మినీ వేలంలో కొందరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది. శివమ్‌ మావి, ముకేష్​ కుమార్‌ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలింది. అయితే శివమ్‌ మావి చాలా మందికి తెలిసినప్పటికీ.. ముఖేష్‌ కుమార్‌ మాత్రం గత సీజన్‌ నుంచే వెలుగులోకి వచ్చాడు. గతేడాది సీఎస్కే తరపున ఆడిన అతడు రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు.

అతడి కోసం వేలంలో సీఎస్కే, దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లు పోటీపడగా.. చివరకు చివరకు ముకేష్​ కుమార్‌ను రూ.5.50 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. అతడిని అంత పెట్టి కొనడంతో అతడెవరో తెలుసుకుందమని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఓ సారి అతడి గురించి తెలుసుకుందాం..

  • 28 ఏళ్ల ముఖేష్‌ కుమార్‌ కోల్‌కతాలో జన్మించాడు.
  • అతడు దేశవాళీ క్రికెట్‌లో బంగాల్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
  • ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 2015లో హరియాణా పై అరంగేట్రం
  • 2016లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం
  • లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు.
  • ఇక టీ20 క్రికెట్‌లో 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు.
  • ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు.
  • స్వదేశంలో న్యూజిలాండ్‌-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ సిరీస్‌లో 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
  • అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్‌లో 20 వికెట్లు పడగొట్టిన ముకేష్​.. బెంగాల్‌ జాయింట్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

ఇదీ చూడండి:IPL Mini auction: ఐపీఎల్‌ చరిత్రలో రికార్డ్‌ ధరకు సామ్ కరణ్​

ABOUT THE AUTHOR

...view details