తెలంగాణ

telangana

ETV Bharat / sports

1166 ప్లేయర్లు - 77 పొజిషన్లు - ఈ మినీ వేలానికి చాలా డిమాండ్ గురూ​

IPL Mini Auction 2023 : ఐపీఎల్‌ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులను అలరించనుంది. అయితే అంతకంటే ముందు వచ్చే మిని వేలం ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా.. ఆ ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఐపీఎల్‌ పిలుపునిచ్చింది. ఆ వివరాలు మీ కోసం..

IPL Mini Auction 2023
IPL Mini Auction 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 7:56 AM IST

Updated : Dec 2, 2023, 8:40 AM IST

IPL Mini Auction 2023 : ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు ఐపీఎల్‌ సీజన్​ వచ్చేస్తోంది. ఇప్పటికే ప్లేయర్ల ట్రేడింగ్​తో ఐపీఎల్ పండుగకు అంతా రెడీ అవ్వగా.. మరి కొద్ది రోజుల్లో మిని వేలం ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా ఈ మిని వేలం జరగనుంది. సుమారు పది ప్రాంఛైజీలు ఈ వేలంలో పోటీ పడనుండగా... 1166 మంది ఆటగాళ్లు పేర్లను ఆ లిస్ట్​లో నమోదు చేసుకున్నారు. వారిలో 830 మంది భార‌త క్రికెట‌ర్లు ఉన్నారు. అందులో 212 మంది క్యాప్డ్, 909 మంది అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లున్నారు. 30 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉండ‌నున్నారు.

మరోవైపు ఈ లిస్ట్​లో మ‌రింత మంది ప్లేయర్లను చేర్చడంపై స్పందించాల‌ంటూ ఆ 10 ఫ్రాంచైజీల‌ను బీసీసీఐ కోరింది. ఇక వ‌న్డే ప్రపంచ క‌ప్​లో పరుగులు వరద పారించిన ట్రావిస్ హెడ్, ర‌చిన్ ర‌వీంద్ర‌, మిచెల్‌, ప్యాట్ క‌మిన్స్​ ఈ వేలం కోసం త‌మ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇక 77 మంది ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఈ సారి 262.95 కోట్లుకు పైగా ఖ‌ర్చు చేయ‌నున్నాయి.

IPL Mini Auction 2023 Players :ఇక రచిన్‌ రవీంద్ర.. తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించగా.. దీని కన్నా 20 రెట్లు అధిక మొత్తానికి అతడు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అఫ్గ‌నిస్థాన్‌ ప్లేయర్ అజ్మ‌తుల్లా ఒమ‌ర్‌జాయ్‌ కూడా డిమాండ్ ఉన్న ఆట‌గాడే. ఇక ఆసీస్‌ వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ప్యాట్ క‌మిన్స్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌ల‌కు రూ. 2 కోట్ల క‌నీస ధ‌రను నిర్ణ‌యించారు. గతంలో జరిగిన మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రికార్డు ధ‌ర ప‌లికిన విష‌యం తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అలరించిన అత‌డ్ని పంజాబ్ కింగ్స్ జట్టు ఏకంగా రూ.18.50 కోట్ల‌కు పెట్టి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒక ప్లేయ‌ర్‌కు అంత ధ‌ర పెట్ట‌డం అనేది ఓ రికార్డే.

ఐపీఎల్ హిస్టరీలోనే యంగ్​ కెప్టెన్​గా విరాట్ - లిస్ట్​లో పంత్, గిల్ - ఇంకా ఎవరంటే?

'కొన్నిసార్లు నిశ్శ‌బ్ద‌మే ఉత్త‌మ స‌మాధానం'- బుమ్రా ఇన్​స్టా స్టోరీకి అర్థం అదేనా!

Last Updated : Dec 2, 2023, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details