IPL mega auction 2022 Mumbai indians: రెండో రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఆసక్తికరంగా సాగింది. అయితే.. తొలిరోజు మెగావేలంలో నలుగురినే కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్.. రెండో రోజు ఆఖర్లో దూకుడుగా వ్యవహరించింది.
వరుసగా విదేశీ ప్లేయర్లను దక్కించుకుంది. వీరికోసం పెద్ద మొత్తమే వెచ్చించింది.
టిమ్ డేవిడ్..
అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో ఇరగదీస్తున్న టిమ్ డేవిడ్ కోసం రూ. 8.25 కోట్లు వెచ్చించింది. ఇతడి టీ-20 స్ట్రైక్ రేట్ 159.39 కావడం విశేషం. బంతిని బలంగా బాదగల ఈ పొడగరి కచ్చితంగా టీమ్‌లో ఉండే అవకాశముంది.
జోఫ్రా ఆర్చర్..
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌ను రూ. 8 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలగడం ఇతడి బలం. ఇంకా డెత్ ఓవర్లలో యార్కర్లతో బెంబేలెత్తిస్తాడు. ఇప్పటికే ఉన్న బుమ్రాకు ఇతడు తోడైతే ముంబయి బౌలింగ్ మరింత పదునెక్కనుంది.
డేనియల్ సామ్స్..