IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ సంచలనం సృష్టించారు. గతసారి కంటే భారీ మొత్తం సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా పాత జట్లకే మరోసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. ఇందులో దీపక్ చాహర్ అయితే ఫ్రాంచైజీ రిటెయిన్ చేసుకున్న అగ్రశ్రేణి క్రికెటర్ ఎంఎస్ ధోనీ కంటే అధిక మొత్తం సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసుకుంది. గత వేలంలో దీపక్‌కి దక్కింది కేవలం రూ. 80 లక్షలే. చెన్నై రిటెయిన్ చేసుకున్న ఎంఎస్ ధోనీకి ఇచ్చేది రూ. 12 కోట్లు. సీఎస్‌కేలో రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు) తర్వాత అత్యధిక విలువ కలిగిన ఆటగాడిగా దీపక్ చాహర్ రికార్డు సాధించాడు. దీపక్ కోసం రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా పోటీ పడింది. అయితే చివరికి సీఎస్‌కే దక్కించుకుంది.
ధోనీని మించిన దీపక్... రోహిత్ శర్మకు చేరువగా ఇషాన్ - ipl mega auction 2022 live updates
IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహర్, ఇషాన్ కిషన్ అదరగొట్టారు. గతసారి కంటే భారీ మొత్తం దక్కించుకున్నారు. ఈ క్రమంలో ధోనీని మించి దీపక్.. రోహిత్ శర్మకు చేరువగా ఇషాన్ ఉన్నారు.
మరోవైపు ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఇషాన్ కిషన్ రూ. 15.25 కోట్లతో అత్యధిక ధరను దక్కించుకున్నాడు. గత వేలంలో ఇషాన్‌కు రూ.6.20 కోట్లు దక్కాయి. ఈసారి భారీ ధర ఇచ్చి మరీ ఈ యువ బ్యాటర్‌ను ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ముంబయి రిటెయిన్ చేసుకున్న ఆ జట్టు సారథి రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు) తర్వాత భారీ ధరను పొందిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ముంబయి రిటెయిన్ చేసుకున్న మిగతా ముగ్గురిలో బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు) కంటే ఇషాన్ కిషనే ఎక్కువ. అంతేకాకుండా వేలంలో యువరాజ్ (రూ.16 కోట్లు) తర్వాత భారీ ధరను దక్కించుకున్న టీమ్‌ఇండియా ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు.
ఇదీ చదవండి:IPL 2022 Mega Auction: హర్షల్ పటేల్ రికార్డు.. రైనాకు షాక్