తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ కేవలం డబ్బు మాత్రమే కాదు.. అది కూడా..: దాదా - ఐపీఎల్ మీడియా రైట్స్​ రికార్డు ధర

IPL Media rights Ganguly: ఐపీఎల్​ మీడియా ప్రసార హక్కుల రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. క్రికెట్‌ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని, ఇది ప్రతిభకు సంబంధించినదని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

ganguly ipl media rights
గంగూలీ ఐపీఎల్​ మీడియా రైట్స్​

By

Published : Jun 15, 2022, 12:12 PM IST

IPL Media rights Ganguly: ఐపీఎల్​లో రాబోయే అయిదేళ్ల కాలానికి 2023 నుంచి 2027 వరకు మీడియా ప్రసార హక్కుల వేలం ముగిసింది. ఈ రైట్స్​.. రూ.48,390 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. దీంతో టీ20 లీగ్‌.. ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఎదిగింది. మీడియా హక్కుల అమ్మకం ద్వారా భారీ ఆదాయం రావడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. క్రికెట్‌ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని, ఇది ప్రతిభకు సంబంధించినదని అన్నాడు. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి ప్రేరణనిస్తుందని, తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందని వివరించాడు.

"క్రికెట్ ఎప్పుడూ డబ్బుకు సంబంధించినది కాదు.. ఇది ప్రతిభకు సంబంధించినది. మన దేశంలో క్రికెట్ ఎంత బలంగా ఉందో.. మీడియా హక్కుల వేలంలోనే తేలింది. యువ ఆటగాళ్లందరికీ వారి సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి, టీమ్‌ఇండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి.. వేలంలో పలికిన భారీ ధరలు అతిపెద్ద ప్రేరణగా ఉండాలి. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. మన దేశంలో క్రికెట్ ఒక మతం. గత 50 ఏళ్లలో ఆటకు ఆదరణ తీసుకువచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు. అలాగే క్రికెట్‌కు అంతగా ఆదరణ లేనప్పుడు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి, టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు వీక్షించిన అభిమానులకు, మద్దతుదారులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు"

-దాదా, బీసీసీఐ అధ్యక్షుడు.

టీ20 మీడియా హక్కుల్లో ఉపఖండపు టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్‌ రూ.23,575 కోట్లకు (మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు) సొంతం చేసుకోగా.. తీవ్ర పోటీ మధ్య ఇండియా డిజిటిల్‌ హక్కులను రిలయన్స్‌ భాగస్వామిగా ఉన్న వయాకామ్‌18 రూ.20,500 కోట్లకు చేజిక్కించుకుంది. నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజీ 'సి'ని (డిజిటట్‌, కొన్ని మ్యాచ్‌లు, భారత్) కూడా వయాకామ్‌ 18 రూ.3257.5 కోట్లకు సొంతం చేసుకుంది. ప్యాకేజీ డిని (రెస్టాఫ్‌ వరల్డ్‌, టీవీ+ డిజిటల్) రూ.1058 కోట్లకు వయాకామ్ 18, టైమ్స్‌ ఇంటర్నెట్ దక్కించుకుంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​తో రీషెడ్యూల్​ టెస్టు.. భారత స్టార్​ ఓపెనర్​ అనుమానమే!

ABOUT THE AUTHOR

...view details