Ipl Kohli Maxwell: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్.. టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఒత్తిడి లేకుండా కనిపిస్తున్నాడని అన్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో ప్రత్యర్థి జట్లకు అదొక హెచ్చరిక అని మాక్స్వెల్ అభిప్రాయపడ్డాడు.
"అతడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కాస్త బాధ పెట్టే విషయమే కానీ విరాట్ అప్పటి నుంచి ఒత్తిడి లేకుండా ఉంటున్నాడు. ఎటువంటి ఒత్తిడి లేకపోవడం వల్ల తన కెరీర్లో మరికొన్ని సంవత్సరాల పాటు ఆటను దిగ్విజయంగా ఆడనున్నాడు. భవిష్యత్తులో అతడు ఉన్న జట్టుకు ప్రత్యర్థిగా ఆడడం కాస్త కష్టమైన విషయమే."