తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఫ్రాంఛైజీలకు బీసీసీఐ లేఖ.. మెగా వేలం నిబంధనలివే.. - ఐపీఎల్ కొత్త జట్లు

వచ్చే ఏడాది ఐపీఎల్​ సీజన్(IPL 2022 Auction)​ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆటగాళ్ల రిటెన్షన్(ipl retention 2022), వేలానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఫ్రాంఛైజీలకు లేఖ రాసింది బీసీసీఐ. ఈ నిబంధనలపై స్పష్టత ఇచ్చారు ఓ ఫ్రాంఛైజీకి చెందిన సీనియర్ అధికారి.

dhoni, kohli
ధోనీ, కోహ్లీ

By

Published : Oct 30, 2021, 10:59 PM IST

ఐపీఎల్​ 2022 సీజన్​ కోసం క్రికెటర్ల మెగా వేలం(IPL Auction 2022) ప్రక్రియ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సీజన్​లో కొత్తగా చేరిన రెండు జట్లతో(IPL New teams) కలిపి 10 టీమ్​లు పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్(IPL Retention Policy), మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ప్రకటించింది బీసీసీఐ. ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో ప్రాంఛైజీకి రూ.90 కోట్ల పరిమితి ఇచ్చింది.

"కొత్త నిబంధనలు తెలుపుతూ అన్ని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ లేఖ పంపింది. ఒక జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 42 కోట్లు, ముగ్గురిని అట్టిపెట్టుకుంటే రూ.33 కోట్లు ఖర్చు చేయాలని తెలిపింది. ఇద్దరు ఆటగాళ్లను ఓ జట్టు రిటైన్ చేసుకుంటే జట్టు పర్సు వాల్యూ నుంచి రూ. 24 కోట్లు ఖర్చు చేసినట్లు. ఒక్క ఆటగాడినే అట్టిపెట్టుకుంటే రూ. 14 కోట్లు ఖర్చు చేసినట్లు." అని ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీకి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఆటగాడి రిటెన్షన్ ఖర్చు ప్రతిసారి ఒకేవిధంగా ఉండదని పేర్కొన్నారు.

'ఒకవేళ దిల్లీ క్యాపిటల్స్​ జట్టు రిషబ్ పంత్​ను రిటైన్​ చేసుకుంటే జట్టు పర్సు వాల్యూ నుంచి రూ. 16 కోట్లు తగ్గుతాయి. కానీ, ప్రాంఛైజీ నుంచి పంత్​ తీసుకునే డబ్బు తక్కువ ఉంటుంది' అని సీనియర్ తెలిపారు.

నిబంధనలివే(IPL Rules)..

  • కొత్త నిబంధనల ప్రకారం.. గత సీజన్లో ఆడిన ఎనిమిది జట్లలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. మిగతా క్రికెటర్లంతా వేలంలోకి రానున్నారు.
  • రిటైన్ చేసుకునే నలుగురు ఆటగాళ్లలో.. ఇద్దరు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు. ముగ్గురు స్వదేశీ, ఓ విదేశీ ఆటగాడైనా ఉండొచ్చు.
  • వేలానికి అందుబాటులో ఉన్న మొత్తం ఆటగాళ్ల నుంచి రెండు కొత్త జట్లకు(అహ్మదాబాద్, లఖ్​నవూ) ఒకేసారి ముగ్గురు ప్లేయర్స్​ను ఎంపిక చేసుకునే హక్కు ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ విదేశీ ఆటగాడు ఉండాలి.
  • అన్​క్యాప్డ్​ ఆటగాళ్ల విషయానికొస్తే.. పాత జట్లు ఇద్దరిని, కొత్త జట్లు ఓ అన్​కాప్డ్​ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
  • జనవరి ఆరంభంలో మెగా వేలం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు బీసీసీఐ లేఖలో పేర్కొంది. నవంబర్​ నెలలో 8 ఫ్రాంఛైజీలు రిటెన్షన్​పై ఫోకస్ చేయాలి. డిసెంబర్ 1-25 మధ్య రెండు కొత్త జట్లు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో ఉండాలి అని స్పష్టం చేసింది.
  • రిటైన్​ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను బట్టి నాలుగు స్లాబ్​లు ఉంటాయి. ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల సంఖ్యను బట్టే ఒక్కో ఆటగాడి ఫీజును నిర్ణయిస్తారు.
  • నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే అది స్లాబ్ 1. ఇందులో మొదటి ఆటగాడికి రూ. 16 కోట్లు, రెండో ప్లేయర్​కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్​కు రూ. 8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ. 6 కోట్లు ఖర్చు చేయాలి. అంటే జట్లు పర్సులోని రూ.90కోట్ల నుంచి రూ. 42 కోట్లు కోతకు గురవుతుంది. ఇక మిగిలిన రూ. 48 కోట్లతోనే ఫ్రాంఛైజీ.. మిగతా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • స్లాబ్ 2లో.. ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మొదటి ఆటగాడికి రూ. 15 కోట్లు, రెండో ప్లేయర్​కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ. 7 కోట్లు ఖర్చు చేయాలి. అంటే.. ఫ్రాంఛైజీ పర్సు నుంచి రూ. 33 కోట్లు ముందుగానే ఖర్చవుతుంది. రూ. 57 కోట్లతో వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.
  • స్లాబ్​ 3లో.. ఇద్దరు ఆటగాళ్లనే అట్టిపెట్టుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఆటగాడికి రూ. 14 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 10 కోట్లు ఫ్రాంఛైజీ ఖర్చు చేయాలి. అంటే జట్టు పర్సు నుంచి రూ. 24 కోట్లు పోగా.. రూ. 66 కోట్లు ఇతర క్రికెటర్ల వేలం కోసం ఉపయోగించొచ్చు.
  • స్లాబ్​ 4లో.. ఒకే ఆటగాడిని రిటైన్ చేసుకోవాలి. ఫ్రాంఛైజీ పర్సు నుంచి రూ. 14 కోట్లు పోగా.. మిగతా రూ. 76 కోట్లను ఇతర క్రికెటర్ల వేలం కోసం ఉపయోగించుకోవచ్చు.
  • ఒకవేళ అన్​క్యాప్డ్​ ఆటగాడిని రిటైన్ చేసుకుంటే.. ఆ ప్లేయర్​ పేరిట రూ. 4 కోట్లు మాత్రమే పర్సు నుంచి తొలగిస్తారు.

ఈ నిబంధనల ఆధారంగా లఖ్​నవూ, అహ్మదాబాద్​కు దక్కే ఆటగాళ్లు(అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, (డుప్లెసిస్/ మొయిన్ అలీ/ బ్రావే)

ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, (కీరన్ పొలార్డ్)

కోల్​కతా నైట్ రైడర్స్: శుభ్​మన్ గిల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్(అన్​క్యాప్డ్),( సునీల్ నరైన్)

రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్​దత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, (గ్లెన్ మ్యాక్స్​వెల్)

దిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, పృథ్వీ షా, (కగిసొ రబాడ, ఎన్రిచ్ నోర్జే)

పంజాబ్ కింగ్స్:కేఎల్​ రాహుల్ జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవర్నీ రిటైన్​ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

రాజస్థాన్ రాయల్స్:సంజూ శాంసన్(ఒప్పుకుంటే), బెన్​ స్టోక్స్ (యాషెస్​ తర్వాత ఆడేందుకు ఆసక్తి చూపితే)

సన్​ రైజర్స్ హైదరాబాద్:రషీద్ ఖాన్(అంగీకరిస్తే)

లఖ్​నవూ:శ్రేయస్ అయ్యర్, డేవిడ్ వార్నర్

అహ్మదాబాద్: పాండ్య సోదరులు- హార్దిక్ పాండ్య , కృణాల్ పాండ్య

ఇదీ చదవండి:

'బెట్టింగ్ సంస్థలు కూడా ఐపీఎల్​ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవచ్చా?'

ABOUT THE AUTHOR

...view details