తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL Auction 2022: అందరి చూపు శ్రేయస్ వైపే.. ఎవరికి దక్కేనో!

ఐపీఎల్-2022 మెగా వేలానికి(IPL 2022 Mega Auction) ముందు అన్ని జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను నవంబర్ 30 లోగా వెల్లడించాల్సి ఉంది. దిల్లీ క్యాపిటల్స్​ ఈ ఏడాది శ్రేయస్​ను వదులుకోవడానికి సిద్ధమైంది. దీంతో ఇతడిపై కన్నేశాయి ఇతర ఫ్రాంచైజీలు. ముఖ్యంగా మూడు జట్లు శ్రేయస్​ను జట్టులోకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Shreyas Iyer IPL 2022, IPL Auction 2022 Shreyas Iyer, శ్రేయస్ అయ్యర్ లేటెస్ట్ న్యూస్, శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2022 మెగా వేలం
Shreyas Iyer

By

Published : Nov 28, 2021, 9:16 AM IST

Shreyas Iyer IPL 2022 Team: శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్​తో జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో సెంచరీతో అలరించాడు. పరిమిత ఓవర్లలోనూ అత్యుత్తమ బ్యాటర్​గా కొనసాగుతున్నాడు. కెప్టెన్​గానూ దిల్లీ క్యాపిటల్స్​కు మరపురాని విజయాలు అందించాడు. అయితే ఈ ఏడాది మెగావేలానికి ముందు ఇతడిని వదులుకునేందుకు సిద్ధమైంది దిల్లీ. దీంతో త్వరలో జరగబోయే వేలంలో(IPL 2022 Mega Auction) ఇతడిని తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అవేంటో చూద్దాం.

శ్రేయస్ అయ్యర్

ఆర్సీబీ..

ఆర్సీబీకి కెప్టెన్సీకి గత సీజన్​తోనే గుడ్​బై చెప్పేశాడు విరాట్ కోహ్లీ. అలాగే ఏబీ డివిలియర్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల మిడిలార్డర్​లోనూ ఈ జట్టుకు బలమైన బ్యాటర్ అవసరం. అందువల్ల ఈ ఫ్రాంచైజీ చురుకైన కెప్టెన్​తో పాటు నమ్మదగిన బ్యాటర్​ను వేలంలో కొనుగోలు చేయాలని చూస్తోంది. దీంతో వారికి శ్రేయస్ అయ్యర్ మంచి ఆప్షన్​లా కనిపిస్తున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్​, మనీష్ పాండేలాంటి ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని చూస్తోంది సన్​రైజర్స్. అయినా వారి బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచుకునేందుకు శ్రేయస్​ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడిని తీసుకోవడం వల్ల మిడిలార్డర్​లో బలమైన బ్యాటర్​తో పాటు జట్టుకు భవిష్యత్ కెప్టెన్​ దొరికినట్లు అవుతుందని భావిస్తోంది యాజమాన్యం.

శ్రేయస్ అయ్యర్

అహ్మదాబాద్

ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అడుగుపెట్టబోతుంది అహ్మదాబాద్. దీంతో వారికి కెప్టెన్​తో పాటు మంచి బ్యాటర్​ కావాల్సి ఉంది. అలాంటి వారికి శ్రేయస్ గొప్ప ఆప్షన్​ అని చెప్పవచ్చు. ఇప్పటికే టోర్నీలో 83 మ్యాచ్​ల్లో 2375 పరుగులతో మంచి ప్రదర్శన కనబర్చాడు శ్రేయస్. ఈ గణాంకాల్ని దృష్టిలో పెట్టుకుని అతడిని వారి జట్టులోకి ఆహ్వానించేందుకు అహ్మదాబాద్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి: 12 నిమిషాల్లోనే మ్యాచ్​కు సిద్ధమవ్వాలన్నారు: భరత్

ABOUT THE AUTHOR

...view details