ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే! - ms dhoni
IPL Auction 2022: ఐపీఎల్లో భాగంగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఏ ప్లేయర్ ఏ ఫ్రాంఛైజీ ఒడికి చేరుతాడు? ఎక్కువ ధర పలికే ఆటగాడు ఎవరు? అని ఫ్యాన్స్‌లో విపరీతంగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన సీజన్లలో అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ ఎవరు? సహా తాజా మెగావేలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం..
IPL Auction 2022
By
Published : Feb 11, 2022, 2:59 PM IST
IPL Auction 2022: మరో రోజులో ఐపీఎల్ మెగావేలం ప్రారంభంకానుంది. ఏ ప్లేయర్‌ను ఏ జట్టు తీసుకుంటుందా అని అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఏ ఆటగాడు ఎక్కువ ధరకు అమ్ముడుపోతాడు? భారత ప్లేయరా లేదా విదేశీ ఆటగాడా? ఇలా అనేక అంశాలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం...
ఐపీఎల్ కప్పుతో ధోనీ
సీజన్ల వారీగా వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్స్ వీరే..
సీజన్
ప్లేయర్
జట్టు
వేలంలో ధర
2008
ఎంఎస్ ధోనీ
చెన్నై
రూ.6 కోట్లు
2009
కెవిన్ పీటర్సన్
ఆండ్రూ ఫ్లింటాఫ్
బెంగళూరు
చెన్నై
రూ.7.55 కోట్లు
2010
షేన్ బాండ్
కీరన్ పొలార్డ్
కోల్‌కతా
ముంబయి
రూ.3.42 కోట్లు
2011
గౌతమ్ గంభీర్
కోల్‌కతా
రూ. 11.04 కోట్లు
2012
రవీంద్ర జడేజా
చెన్నై
రూ. 9.72 కోట్లు
2013
గ్లెన్ మ్యాక్స్‌వెల్
ముంబయి
రూ. 5.3 కోట్లు
2014
యువరాజ్ సింగ్
బెంగళూరు
రూ. 14 కోట్లు
2015
యవరాజ్ సింగ్
దిల్లీ
రూ. 16 కోట్లు
2016
షేన్ వాట్సన్
బెంగళూరు
రూ. 9.5 కోట్లు
2017
బెన్‌స్టోక్స్
పుణె
రూ. 14.5 కోట్లు
2018
బెన్‌స్టోక్స్
రాజస్థాన్
రూ. 12.5 కోట్లు
2019
వరుణ్ చక్రవర్తి
జయదేవ్ ఉనద్కత్
పంజాబ్
రాజస్థాన్
రూ. 8.4 కోట్లు
2020
ప్యాట్ కమిన్స్
కోల్‌కతా
రూ. 15.5 కోట్లు
2021
క్రిస్ మోరిస్
రాజస్థాన్
రూ. 16.25 కోట్లు
2022
?
?
?
వేలంలో ఒక ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..
ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 590 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. వీరిలో 228 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, మరో 355 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా ఉన్నారు. మరో ఏడుగురు అసోసియేట్ దేశాల క్రికెటర్లూ ఇందులో పాల్గొంటున్నారు.
కాగా, ఈ ఏడాది రెండు కొత్త జట్లు చేరాయి. అందులో ఒకటి అహ్మదాబాద్ టైటాన్స్ కాగా, రెండోది లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.