రాబోయే ఐపీఎల్ మెగా టోర్నీకి సంబంధించిన వేలం పాట పూర్తయింది. దీంతో మొత్తం పది ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. వేలంలో పలువురు ఆటగాళ్లు అనూహ్య ధరకు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయగా.. పలువురి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇంకొంత మంది గతేడాది కంటే తక్కువ ధరకు కూడా ఇతర జట్లకు తరలిపోయారు. ఇక రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లలో ఎవరెవరికి ఎంతెంత దక్కింది.. గత ఏడాదితో పోల్చితే.. పెరిగిందా..? తగ్గిందా..? ఓ సారి పరిశీలిస్తే..
చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరణ్ పొలార్డ్
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆండ్రీ రసెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్
సన్‌రైజర్స్ హైదరాబాద్:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్