తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL Auction 2022: ఈ ప్లేయర్లే చెన్నై జట్టు టార్గెట్​! - సీఎస్కే రిటెయిన్​ ప్లేయర్స్​

IPL Auction 2022 CSK Target players: ఐపీఎల్​ మెగావేలం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్లు ఎవరెవరిని తీసుకుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్​ వీరిని తీసుకోనుందంటూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వాళ్లెవరంటే?

IPL Auction 2022 CSK Target players
IPL Auction 2022 CSK Target players

By

Published : Jan 27, 2022, 11:49 AM IST

IPL Auction 2022 CSK Target players: ఈ ఐపీఎల్​ సీజన్​ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో పాల్గొనే ఆయా జట్లు తమ రిటైన్​ ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించేశాయి. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం కూడా జరగనుంది.

ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్టర్​ కూల్​ ధోనీ సారథ్యంలో ఈ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్​గా నిలిచింది. ఈ మెగా వేలంలో చెన్నై సూపర్​ కింగ్స్ ఏ ప్లేయర్స్​ను కొనుగోలు చేయనుందో అని అభిమానుల్లో విపరీతంగా ఆసక్తిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ​సీఎస్కే.. తమ పాత ప్లేయర్స్​ను కొంతమందిని రిటైన్ చేసుకోవాలని భావిస్తోందట.

బ్యాటర్ డుప్లెసిస్​​

రుతురాజ్​ గైక్వాడ్​ - దక్షిణాఫ్రికా బ్యాటర్​ డుప్లెసిస్.. సీఎస్కే బ్యాటింగ్​ లైనప్​కు వెన్నుముక లాంటోళ్లు. ఇప్పటికే రిటైన్ చేసుకున్న గైక్వాడ్​ గత సీజన్​లో ఆరెంజ్​ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు. డుప్లెసిస్​ కూడా గత ఐపీఎల్​లో ఆడిన 16 మ్యాచుల్లో 45.21సగటుతో 633 పరుగులు చేసి ఎక్కువ పరుగులు​ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఆరుకు పైగా అర్ధసెంచరీలు ఉన్నాయి.

ఆల్​రౌండర్​ బ్రావో

సీఎస్కేకు ఇప్పటికే స్టార్ ఆల్​రౌండర్లు మొయిన్​​ అలీ, రవీంద్ర జడేజాను అట్టిపెట్టుకుంది. అయితే IPL 2021లో బ్రావో 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టి చెన్నై విజయానికి పెద్ద సహకారం అందించిన బ్రావోను రిలీజ్​ చేసింది. ఇప్పుడతడిని మెగా ఆక్షన్​లో సొంతం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుందట! సీఎస్కేతో పాటు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ కూడా ఇతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

శార్దూల్​ ఠాకూర్​

శార్దూల్​ ఠాకూర్​.. ఇప్పటికే ఆల్​రౌండర్​గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గత సీజన్​లో సీఎస్కే తరఫున అత్యధికంగా 21 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అవసరమైన సందర్భాల్లో కీలక ఇన్నింగ్స్​ ఆడి జట్టుకు అండగా నిలిచాడు. మొత్తంగా ఈ మెగాటోర్నీలో 61 మ్యాచులు ఆడి 67 వికెట్లు దక్కించుకున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జరిగిన సిరీస్​లోనూ బాగానే రాణించాడు.

వీరు కూడా

లుంగి ఎంగిడి, దీపక్​ చాహర్, హేజిల్​​వుడ్​ తీసుకోవడానికి సీఎస్కే ఆసక్తి చూపుతోందట! దక్షిణాఫ్రికా బౌలర్​ ఎంగిడి గత సీజన్​లో మూడు మ్యాచులు ఆడి ఐదు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మెగాటోర్నీలో 14 మ్యాచులు ఆడి 25 వికెట్లను దక్కించుకున్నాడు. దీపక్​ చాహర్​ను ప్రధాన్​ పేసర్​గా తీసుకోవచ్చు. గత సీజన్​లో ఇతడు 15 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. మొత్తంగా ఐపీఎల్​లో 63 మ్యాచుల్లో 59 వికెట్లు తీశాడు. బ్యాకప్​ పేసర్​గా జోష్​ హేజిల్​వుడ్ తీసుకుంటుంది తెలుస్తోంది.

కగిసొ రబాడా

ప్రస్తుతం క్రికెట్​లో ఉన్న అద్భుతమైన పేసర్లలో కగిసొ రబాడా ఒకడు. ఇతడిని కూడా కొనుగోలు చేయాలని సీఎస్కే ఆసక్తి చూపుతోందని తెలిసింది. 2020 సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ ఫైనల్ చేరుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ ఏడాది 17 మ్యాచులు ఆడిన అతడు 30 వికెట్లు తీసి ఆ సీజన్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. 2021లో 15 మ్యాచులు ఆడి 15 వికెట్లను దక్కించుకున్నాడు. ​ఇప్పుడతడిని ఈ మెగావేలం ముందు దిల్లీ ఫ్రాంచైజీ రిలీజ్​ చేసింది. అయితే ఈ ఐపీఎల్​లో అతడిని సేవల్ని వినియోగించుకోవాలని సీఎస్కే యోచిస్తున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి. చెన్నై జట్టుతో పాటు పలు ఫ్రాంచైజీలు కూడా అతడిని దక్కించేందుకు పోటీ పడబోతున్నట్లు తెలిసింది.

సీఎస్కే రిటైన్ చేసుకున్న ప్లేయర్స్​

ఈ సీజన్​ ఐపీఎల్ కోసం ఇటీవల జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా సీఎస్కే.. ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజా (రూ.16 కోట్లు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (రూ.12 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్‌ (రూ.6 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. సీఎస్కే పర్సులో ఇంకా రూ.48 కోట్లు ఉన్నాయి.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

'ధోనీలాంటోడు ఉండాల్సిందే.. ఆ సత్తా ఇద్దరికే ఉంది'

ABOUT THE AUTHOR

...view details