IPL 2024 Jaydev Unadkat :దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలం అట్టహాసంగా జరిగింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా ఆయా ఫ్రాంఛైజీలు 77 మందిని వేలంలో దక్కించుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయి ధర రూ.24.75కోట్లకు మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. మరో ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్‌ను రూ.20.50 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే సన్‌రైజర్స్ భారత పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను రూ.1.6కోట్లకు కొనుగోలు చేసింది.
Jaydev Unadkat SRH :ఈ సందర్భంగా టీమ్ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా ఫోన్లో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తనను ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని జయదేవ్ ఉనద్కత్ తెలిపాడు. ఇది తన కెరీర్‌లో కొత్త దశగా వర్ణించాడు.
"సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కోసం (ఒక జట్టుగా) వేలం బాగా జరిగింది. మొదటి నుంచి వేలం నాకు ఓ భిన్నమైన అంశం. ఇది నా కెరీర్‌లో ఒక కొత్త దశ. మేం ట్రోఫీ గెలుస్తామని ఆశిస్తున్నాను. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో ఆడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"
-- జయదేవ్ ఉన్కదత్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్
గతంలో ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున జయదేవ్ ఉనద్కత్ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు లీగ్‌లో 94 మ్యాచ్‌లు ఆడాడు. 8.85 ఎకానమీ వద్ద 5/25 అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో ఇప్పటి వరకు 91 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనను ఇచ్చాడు.
టీమ్ఇండియా తరఫున నాలుగు టెస్ట్‌లు, ఎనిమిద వన్డేలు ఆడాడు ఉనద్కత్. పది టీ20 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లను పడగొట్టాడు. 2016లో జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. చివరగా ఈ ఏడాది జులైలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్
Sunrisers Hyderabad Players 2024 List :అబ్దుల్ సమద్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారూఖీ, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, కమిన్స్, ట్రావిస్ హెడ్, జయ్‌దేవ్ ఉనద్కత్, వనిందు హసరంగ, ఆకాశ్ సింగ్, సుబ్రమణ్యన్.
అంచనాలను మించిన మినీ వేలం - ఓవర్సీస్ హౌస్‌ఫుల్- టాప్ ప్లేయర్లు వీరే
IPL 2024కు 10 ఫ్రాంచైజీలు సిద్ధం- ఏ టీమ్‌లో ఎవరున్నారో తెలుసా?