ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ భారత్‌లో జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు 2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్, మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడం బీసీసీఐకి సమస్యగా మారిందనే చెప్పవచ్చు. మరి రానున్న ఐపీఎల్ సీజన్‌ను భారత్‌లో నిర్వహించడానికి వీలు కాకపోతే.. బీసీసీఐప్లాన్ ఎలా ఉండనుందంటే..
ప్రతి ఏడాది ఐపీఎల్ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమౌతుంది. దాదాపు 50 -60 రోజులపాటు క్రికెట్ ప్రియుల్ని అలరించి.. మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే జూన్ 4 నుంచి 2024 టీ20 ప్రపంచకప్జరగనున్నందున.. ఐపీఎల్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు. మినీ వరల్డ్ కప్ సన్నద్ధతకు ఆయా దేశాల ఆటగాళ్లు, లీగ్‌లో మొత్తం మ్యాచ్‌లు ఆడకుండానే వారి స్వదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగే మన ప్లేయర్లకూ ప్రాక్టీస్ చేయడానికి ఉండే సమయం కూడా తక్కువే..
కాగా ఓ దశాబ్ద కాలం నుంచి భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో ఛాంపియన్‌గా నిలవలేదు. దీనికి ఐపీఎల్ కూడా ఓ కారణమని ఇప్పటికీ.. పలువురు క్రీడా విశ్లేషకుల నుంచి బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంటుంది. అందుకని 2024 ఐపీఎల్‌ను ముందుగానే ప్రారంభిద్దామంటే.. టీమ్ఇండియా.. స్వదేశంలో మార్చి 11 వరకూ ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.