తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2024 వేలానికి 333 మంది ప్లేయర్లతో ఫైనల్​ లిస్ట్​- వీరికే ఫుల్ డిమాండ్! - ఐపీఎల్ 2024 వేలం తేదీ సమయం

IPL 2024 Auction Player List : ఐపీఎల్ 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో 333 మంది ప్లేయర్లతో తుది జాబితా సిద్ధం చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. అందులో భారత్​ ఆటగాళ్లతో పాటు, ఇటీవల వరల్డ్​ కప్​ సాధించిన ఆసీస్​ టీమ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ వివరాలు మీకోసం.

IPL 2024 Auction Player List
IPL 2024 Auction Player List

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 7:33 AM IST

Updated : Dec 12, 2023, 8:21 AM IST

IPL 2024 Auction Player List :ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. దుబాయ్​లో కోకాకోలా ఎరినా వేదికగా ఈ నెల 19న జరిగే ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 77 ఖాళీలు భర్తీ చేసుకోవడానికి ఫ్రాంచైజీలు వీరిలోని అత్యుత్తమ ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి. ఈ ప్లేయర్ల జాబితాలో భారత ప్లేయర్లు హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేశారు.

ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం 1166 మందితో కూడిన లిస్ట్​ను ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా తుది జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్ఠంగా 30 మంది విదేశీ క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయొచ్చు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కమిన్స్‌, ట్రావిస్‌ హెడ్‌, ఇంగ్లిస్‌, మిచెల్‌ స్టార్క్‌లకు ఈ వేలం మంచి డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది. వీళ్లు తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారు. న్యూజిలాండ్‌ యంగ్​ సెన్సేషన్ రచిన్‌ రవీంద్రపై కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే అతడి బేస్​ ప్రైజ్ రూ. 50 లక్షలుగా ఉంది. కానీ, అతడు వేలంలో పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి. అత్యధిక ధరకు అమ్ముడైనా ఆశ్చర్యం లేదు.

కనీస ధర రూ. 1.5 కోట్ల ప్లేయర్లు..

  • మహ్మద్ నబీ - అఫ్గానిస్థాన్
  • క్రిస్ లిన్ - ఆస్ట్రేలియా
  • టామ్ కరన్ - ఇంగ్లాండ్​
  • కొలిన్ మున్రో - న్యూజిలాండ్
  • వానిందు హసరంగ - శ్రీలంక
  • జేసన్ హోల్డర్ - వెస్టిండీస్
  • టిమ్ సౌథీ - న్యూజిలాండ్

కనీస ధర రూ. 1కోటి ప్లేయర్లు..

  • డారిల్ మిచెల్ - న్యూజిలాండ్
  • ఆస్టన్ ఏగర్ - ఆస్ట్రేలియా
  • డీఆర్​సీ షాట్ - ఆస్ట్రేలియా
  • ఆస్టన్ టర్నర్ - ఆస్ట్రేలియా
  • గాస్ అట్కిసన్ - ఇంగ్లాండ్​
  • శామ్ బిల్లింగ్స్ - ఇంగ్లాండ్
  • ఆడమ్ మిల్నే - న్యూజిలాండ్
  • వెయిన్ పార్నెల్ - సౌతాఫ్రికా
  • డ్వెన్ ప్రిటోరియస్ - సౌతాఫ్రికా
  • అల్జారీ జోసెఫ్ - వెస్టిండీస్
  • రోమన్ పావెల్ - వెస్టిండీస్​
  • డేవిడ్ వీస్ - సౌతాఫ్రికా

అమల్లోకి 'స్టాప్​ క్లాక్'​ రూల్- అలా చేస్తే 5 పరుగులు పెనాల్టీ తప్పదు

శుభమన్​ కోసమే ఎక్కువ మంది సెర్చ్ చేశారట- గిల్​కు 2023 బాగా కలిసొచ్చిందిగా!

Last Updated : Dec 12, 2023, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details