తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: ఆ ఆటగాళ్లకు గుడ్​బై చెప్పనున్న సన్​రైజర్స్​.. లిస్ట్​ రెడీ చేసిన కావ్య​! - ఐపీఎల్​ 2023 సన్​రైజర్స్​ హెదరాబాద్​

IPL 2023: ఐపీఎల్ 2023 హడావుడి అప్పుడే మొదలైంది. వచ్చేనెలలో జరగనున్న మినీ వేలం కోసం అన్ని టీమ్​లు తాము రిటైన్​ చేసుకునే ప్లేయర్లను జాబితాను రెడీ చేస్తున్నాయి. అయితే ఆరెంజ్​ ఆర్మీ ఈ సారి చాలా మంది ఆటగాళ్లను ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. వారెవరంటే?

ipl 2023 sunrisers hyderabad
ipl 2023 sunrisers hyderabad

By

Published : Nov 8, 2022, 3:26 PM IST

IPL 2023 Sunrisers Hyderabad : ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్​ 2022 చివరి అంకానికి చేరుకుంది. బుధవారం, గురువారం సెమీఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. మెల్​బోర్న్​ గ్రౌండ్స్​లో ఆదివారం ఫైనల్ జరగనుంది. ఈ హడావుడిలో ఐపీఎల్​ 2023కు సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది. డిసెంబర్‌లో నిర్వహించే మినీ వేలం పాట కోసం నవంబరు 15 నాటికి అన్ని ఫ్రాంచైజీలు.. తమ రిటైన్​ ప్లేయర్ల తుది జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌కు అందజేయాల్సి ఉంది. దీంతో అన్ని జట్లు కసరత్తు చేస్తున్నాయి.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లిస్ట్ కూడా దాదాపుగా ప్రిపేర్ అయినట్టే కనిపిస్తోంది. జట్టులో అట్టిపెట్టుకునే ప్లేయర్లు ఎవరు? ఎవరిని మినీ వేలం కోసం విడుదల చేయాలి? అనే అంశాలపై ఇప్పటికే ఫ్రాంచైజీ ఓనర్​ కావ్య మారన్​ ఓ నిర్ణయానికి వచ్చారట. అంచనాలకు అనుగుణంగా రాణించని ప్లేయర్లను వదిలించుకోవడానికి ఆమె సిద్ధపడ్డారట.

ఆరెంజ్​ ఆర్మీ నుంచి ఉద్వాసనకు గురయ్యే ప్లేయర్ల జాబితా కాస్త పెద్దదే అని సమాచారం. రొమారియో షెప్పర్డ్, జగదీశ సుచిత్, కార్తీక్ త్యాగి, సీన్ అబాట్, శశాంక్ సింగ్, ఫజహక్ ఫారూఖీ, శ్రేయస్ గోపాల్‌ను మినీ వేలం పాట కోసం విడుదల చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ప్రియమ్​ గర్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, మార్కో జెన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌ను అట్టిపెట్టుకోనుందట. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా.. ఎనిమిది మ్యాచుల్లో ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.

ABOUT THE AUTHOR

...view details