తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సన్​రైజర్స్'​కు కొత్త కెప్టెన్​.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు బాధ్యతలు - tata ipl 2023

IPL 2023 SRH Captain : ఐపీఎల్​ టీమ్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​కు కొత్త కెప్టెన్ వచ్చాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏడెన్ మార్​క్రమ్​కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా ప్రకటించింది.

srh new captain aiden markram
aiden markram

By

Published : Feb 23, 2023, 1:06 PM IST

Updated : Feb 23, 2023, 2:11 PM IST

IPL 2023 SRH Captain : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు కొత్త కెప్టెన్​ వచ్చాడు. జట్టు సారథ్య బాధ్యతలను సౌతాఫ్రికా ఆల్​రౌండర్​ ఏడెన్ మార్​క్రమ్​కు అప్పగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫ్రాంచైజీ సోషల్​ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే హైదరాబాద్​ టీమ్​కు విదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా స్టార్​ బ్యాటర్ డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్​గా వ్యవహరించారు. ఇక, మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్‌ కుమార్‌కు కెప్టెన్‌ బాధ్యతలు నిర్వర్తించాడు.
కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్​ మినీ వేలంలో హైదరాబాద్​ జట్టు మాజీ కెప్టెన్లు డేవిడ్​ వార్నర్​, కేన్​ విలియమ్సన్​ను రిలీజ్​ చేసింది. దీంతో ఆ జట్టు సారథి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మార్‌క్రమ్‌ లేదా టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ ఫ్రైంచైజీ మార్‌క్రమ్‌ వైపు మొగ్గుచూపింది. అయితే మార్​క్రమ్​ ఇదివరకే సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టుకు సారథ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఎస్‌ఏ20 (ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నీ)టోర్నీలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ జట్టు విజయం సాధించింది. దీంతో ఎస్​ఆర్​హెచ్​ మార్​క్రమ్​కు కెప్టెన్​ పగ్గాలు అప్పగించింది.

Last Updated : Feb 23, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details