ఐపీఎల్ మొదలైందంటే చాలు.. క్రికెట్ అభిమానులకు పండగే. ఎక్కడ మ్యాచ్ జరిగినా అక్కడి స్టేడియం ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2023) సంబరం మరో నాలుగు రోజుల్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి అహ్మాదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌తో సీజన్ ఆరంభం కానుంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపులకు చేరుకుని శిక్షణ కూడా ప్రారంభించేశారు. నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలానే ఇతర ప్లేయర్స్‌తో కలిసి ఖాళీ సమయాల్లో కాస్త సరదాగా కూడా గడుపుతున్నారు. ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్నారు. ఇంకొంతమంది త్వరలోనే తమ క్యాంపులకు చేరుకున్నారు. ప్రస్తుతం వీటన్నింటికీ సంబంధించిన వీడియోలను ఆయా ఫ్రాంచైజీలు సోషల్‌మీడియా వేదికగా తమ అధికార అకౌంట్లలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో మరింత జోష్‌ను నింపుతున్నాయి. మంచి క్యాప్షన్లను జోడిస్తున్నాయి. అలా ప్లేయర్స్ సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోలు, ప్రాక్టీస్‌తో పాటు సరదాగా చిల్ కొడుతున్న వీడియోలు.. ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. అవి సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వీడియోలు మీరు ఓ సారి చూసేయండి..
IPL 2023: ప్లేయర్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.. ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ - ipl 2023 practising videos
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2023) సంబరం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అభిమానుల్లో మరింత జోష్‌ను పెంచేందుకు.. ఆయా ఫ్రాంచైజీలు తమ ప్లేయర్స్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేస్తున్నాయి. అవి మీకోసం..
ఇకపోతే ఈ లీగ్‌లో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. గ్రూప్-ఏలో ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, దిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. గ్రూప్-బీలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ఈ10 జట్ల మధ్య 70 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. దేశంలోని 12 వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అహ్మదాబాద్, లఖ్‌నవూ, మొహాలి, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, చెన్నై, జయ్‌పుర్, కోల్‌కతా, ముంబయి, ధర్మశాల, గువాహటి వేదికలుగా ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. చివరి లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. మే 28న అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకటి.. రాత్రి 7.30 గంటలకు మరొకటి నిర్వహిస్తారు. కాగా, ఐపీఎల్ 2023 ఆరంభోత్సవ వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మిక మంధాన, సీనియర్ హీరోయిన్ తమన్నా భాటియా సందడి చేయనున్నారని ఇటీవలే ప్రచారం సాగింది. లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని తెలిసింది.
ఇదీ చూడండి:KKR కెప్టెన్సీ అఫీషియల్ అనౌన్స్మెంట్.. కొత్త సారథి అతడే