క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూసే మూమెంట్ రానే వచ్చింది. 15 సీజన్లు పూర్తి చేసుకున్న ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ సీజన్ ఇప్పుడు 16వ సీజన్‌తో మన ముందుకు వస్తోంది. మార్చి 31 నుంచి ప్రారంభమవ్వనున్న ఈ సీజన్లో పది జట్లు.. మొత్తం 70 మ్యాచ్‌ల్లో హోరా హోరీగా తలపడనున్నాయి.
ఐపీఎల్ 2023 షెడ్యూల్ రిలీజ్.. చెన్నై- గుజరాత్ మధ్యే తొలి మ్యాచ్ - IPL 2023 matches
క్రికెట్ అభిమానులకు పండగ సీజన్ వచ్చేసింది. బీసీసీఐ శుక్రవారం ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మార్చి 31వ తేదీన గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరగనుంది. లీగ్‌ల వరకు షెడ్యూల్ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలను ప్రకటించాల్సి ఉంది.
ఐపీఎల్ 2023
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సీజన్‌కు శుభారంభం చేయనున్నాయి. ఏప్రిల్ 2న హైదరాబాద్‌లో.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. తొలి సమరం జరిగే చోటే మే 28న ఆఖరి మ్యాచ్ జరగనుంది.
- 52 రోజుల పాటు జరగనున్న ఈ సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయి.
- బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొత్తం 52 రౌండ్ల రాబిన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
- వీక్ డేస్‌లో ఓ మ్యాచ్ ఉండగా.. ప్రతి శని, ఆదివారాల్లో డబుల్ హెడర్‌లు షెడ్యూల్ చేశారు.
- ఈ సీజన్లో మొత్తం 18 డబుల్ హెడర్‌లు ఉండగా, డే గేమ్‌లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలుకానున్నాయి. ఈవెనింగ్ మ్యాచ్‌లు సాయంత్రం 07:30 గంటలకు ప్రారంభమవుతాయి.
- మార్చి 31వ తేదీన తొలిమ్యాచ్‌లో గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
- తొలి లీగ్ రౌండ్లో అన్ని టీమ్స్ చెరో 14 మ్యాచ్‌లు ఆడనుండగా లీగ్ రౌండ్లో మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి.
- ఈ మ్యాచ్‌లన్నీ ముగిశాక ఫైనల్స్‌కు చేరువగా ఉన్న టీమ్స్ ప్లే ఆఫ్స్ రూపంలో మరో నాలుగు మ్యాచ్‌లకు తలపడతారు.
- అలా సీజన్ మొత్తం మీద 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే చివరి లీగ్ మే 21న జరగనుండగా ప్లే ఆఫ్ మ్యాచ్‌ల తేదీలను బీసీసీ ఇంకా ఖరారు చేయలేదని సమాచారం.
- టీమ్స్ అన్నీ ఏడు మ్యాచ్‌లు సొంత గడ్డపై ఆడనుండగా మరో ఏడు మ్యాచ్‌లు ఇతర స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది.
- గ్రూప్ ఏలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నపూ సూపర్ జెయింట్స్ ఉండగా.. గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఉన్నాయి.
- ఈ సీజన్‌కు 12 వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. అహ్మదాబాద్, లఖ్‌నవూ, ముంబయి, హైదరాబాద్ సహా మరో ఎనిమిది వేదికలు సమరానికి సిద్ధమయ్యాయి.
Last Updated : Feb 17, 2023, 7:34 PM IST