తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: రోహిత్ శర్మ భారీ సిక్సర్​.. ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్​.. వీడియో చూశారా? - ఐపీఎల్​ సిక్సర్ వీడియో వైరల్​

ఐపీఎల్​ ప్రాక్టీస్​ సెషన్​లో భాగంగా ముంబయి కెప్టెన్ రోహిత్​ శర్మ అదిరిపోయే సిక్సర్​ను బాదాడు. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Rohith sharma Practice session Sixer video viral
రోహిత్ శర్మ ఐపీఎల్​ భారీ సిక్సర్

By

Published : Mar 30, 2023, 4:33 PM IST

Updated : Mar 30, 2023, 5:20 PM IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌కు కౌంట్‌డౌన్‌ షురూ అయింది. క్రికెట్‌ అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగించే ఈ మెగా లీగ్‌ సంబరం మార్చి 31(శుక్రవారం) నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. బ్యాటర్ల అదిరిపోయే ఇన్నింగ్స్​, బౌలర్ల మ్యాజిక్​లు, ఫీల్డర్ల విన్యాసాలను చూసేందుకు ఫ్యాన్స్​ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్‌.. తాజా సీజన్​లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగబోతుంది. కానీ ఆ జట్టుకు స్టార్‌ పేసర్‌ బుమ్రా, విధ్వంసకర ప్లేయర్​ టిమ్‌ డేవిడ్‌ దూరమవ్వడం పెద్ద లోటే అని చెప్పాలి. కానీ గత సీజన్‌కు దూరంగా ఉన్న ఇంగ్లాండ్​ స్టార్‌ పేసర్‌ జోఫ్రా అర్చర్‌ తిరిగి అందుబాటులోకి రావడం కలిసొచ్చే అంశం. ఇంకా కామెరూన్ గ్రీన్​తో సహా పలువురు ఆటగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ తనయుడు అర్జున్​ కూడా ఈ సారి ముంబయి తరఫున ఐపీఎల్​ అరంగేట్రం చేసే ఛాన్స్​లు ఉన్నాయి.

అయితే ఇప్పటికే ఈ మెగా టోర్నీ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడిన ముంబయి.. ఈ సారి ఎలాగైనా కప్​ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీని కోసం గట్టిగానే ప్రాక్టీస్ చేస్తూ శ్రమిస్తోంది. బ్రబౌర్న్‌ వేదికగా తమ నెట్​ ప్రాక్టీస్‌ను చేస్తోంది. హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ నేతృత్వంలోముంబయి.. ప్రా‍క్టీస్‌ సెషన్స్‌లో ఫుల్​ బీజీగా గడుపుతోంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నెట్స్​లో తీవ్రంగా చెమటోడుస్తున్నాడు. తనదైన స్టైల్‌లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ బౌలర్​ వేసిన బంతిని భారీ సిక్సర్​గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్​ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ రోహిత్​ కనిపిస్తున్నాడని కొనియాడుతున్నారు.

కాగా, గత సీజన్​లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. మొత్తం 14 మ్యాచులు ఆడిన అతడు.. 19.14 సగటుతో 268 రన్స్​ మాత్రమే చేశాడు. అతడి వైఫల్యం కూడా జట్టు ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఐపీఎల్‌ 2023 వేలంలో రోహిత్​ శర్మ కోసం రూ.17 కోట్లను వెచ్చించింది ముంబయి ఇండియన్స్​. అయితే అతడు ఈ ఏడాది సీజన్‌లోని పలు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. అతడు అందుబాటులో లేని మ్యాచ్‌లకు.. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథిగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ముంబయి ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను.. ఏప్రిల్‌ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

ఇదీ చూడండి:అర్జున్​ తెందుల్కర్​ ఈ సారైనా ఐపీఎల్ ఎంట్రీ ఇస్తాడా.. రోహిత్​ రియాక్షన్ ఇదే!

Last Updated : Mar 30, 2023, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details