తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ ఐపీఎల్ కెరీర్​పై రోహిత్ కామెంట్స్​.. ఏం అన్నాడంటే? - IpL 2023 ceremony

సీఎస్కే కెప్టెన్ ధోనీ ఐపీఎల్​ కెరీర్​పై ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ చేశాడు. ఆ వివరాలు..

Rohith sharma on dhoni ipl career
ధోనీ ఐపీఎల్ కెరీర్​పై రోహిత్ కామెంట్స్​.. ఏం అన్నాడంటే?

By

Published : Mar 29, 2023, 6:47 PM IST

ఐపీఎల్ 2023 దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమ్​ఇండియా, ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్ భవితవ్యంపై మాట్లాడాడు. అలాగే జట్టుకు బుమ్రా దూరం అవ్వడంపై కూడా మాట్లాడాడు. మహీ ఇప్పటికీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని.. మరో రెండు, మూడు సీజన్ల పాటు అతడు ఈ మెగాటోర్నీ ఆడే సత్తా ఉందని వెల్లడించాడు.

చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్‌ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని అంటున్నారు? మీరు కూడా ఇదే అనుకుంటున్నారా? అని మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు. "గత మూడు నాలుగేళ్లుగా మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ అనే మాట వింటూనే ఉన్నాను. నాకు తెలిసి తను ఇప్పటికీ అతడు ఫిట్‌గానే కనిపిస్తున్నాడు. ఇంకొన్ని సీజన్ల పాటు ఆడే సత్తా అతడికి ఉంది" అని హిట్​మ్యాన్​ పేర్కొన్నాడు.

ఇక ముంబయి స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి కూడా మాట్లాడాడు. టీమ్​కు అతడు దూరం అవ్వడంపై స్పందిస్తూ.. "అతడి సేవలు కోల్పోవడం మాకు భారీ ఎదురుదెబ్బ లాంటిది. ఆ లోటు ఎవరు తీర్చలేరని నా ఉద్దేశం. అయితే యంగ్ ప్లేయర్స్​కు ఛాన్స్​ ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నాం. అలాగని వారిపై ఒత్తిడి పెంచే విధంగా మేం వ్యవహరించము. అర్హత ఉన్నవారికి తప్పకుండా అవకాశాలు ఇస్తాం" అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

కాగా, ఐపీఎల్ 2023 చెన్నై సూపర్‌ కింగ్స్‌-డిఫెండింగ్​ ఛాంపియన్​ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభంకానుంది. మార్చి 31 నుంచి షురూ కానుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొననున్న పది టీమ్​లు తమ క్యాంపులకు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించేశాయి. ఇకపోతే ఏప్రిల్‌ 2న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్​ను ఆడనుంది. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్​ ఇప్పటికే ఐదుసార్లు చాంఫియన్‌గా నిలిచింది. అలాగే మహీ సారథ్యంలో సీఎస్కే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. అలా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటికీ వీరిద్దరు అత్యంత విజయవంతమైన సారథులుగా కొనసాగుతున్నారు. కానీ గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ముంబయి ఇండియన్స్​ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా.. చెన్నై సూపర్​ కింగ్స్​ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇంకా ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు కూడా అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలో టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ అట్రాక్షన్​గా నిలవనుంది. ఈ ముద్దుగుమ్మతో పాటు మరింతమంది స్టార్లు కూడా మెరిసే అవకాశముంది.

ఇదీ చూడండి:IPL 2023: ముంబయి మాత్రమే సాధించిన ఈ రికార్డులు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details