తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెరుగుతున్న కొవిడ్ కేసులు.. IPL ప్లేయర్లకు కీలక ఆదేశాలు.. పాజిటివ్​ వస్తే..​! - ఐపీఎల్​ 2023 మొదటి మ్యాచ్​

ఐపీఎల్​ సీజన్​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కొవిడ్​ వల్ల దాదాపు మూడేళ్ల పాటు ఈ ఆట వెలవెలబోయింది. ఇప్పుడు ఈ కొత్త సీజన్​తో మరోసారి పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. అయితే మరోసారి కొవిడ్​ కలకలం సృష్టిస్తున్న వేళ ఆటగాళ్ల ఆరోగ్య దృష్ట్యా బీసీసీఐ తగు జాగ్రత్తలు తీసుకోనుందట.

ipl 2023 covid
ipl 2023 covid

By

Published : Mar 22, 2023, 1:36 PM IST

మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఆయా వేదికలు ఈ సంబరాలు కోసం సిద్ధమయ్యాయి. అభిమానులందరూ తమ క్రికెట్​ హీరోలను కలర్​ఫుల్​ జెర్సీల్లో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నారు. తాజాగా మళ్లీ కొవిడ్​ మహమ్మారి.. వ్యాప్తిస్తున్న వేళ ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్ల ఆరోగ్య దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలంటూ బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసిందట. ఈ క్రమంలో ఐపీఎల్​ ఆటగాళ్లకు కొవిడ్ టెస్ట్​ నిర్వహించడంతో పాటు పాజిటివ్​ వచ్చిన వారు తప్పనిసరిగా వారం రోజులు ఐసోలేషన్​లో ఉండేలా చూసుకోవాలని సూచించినట్లు సమచారం.

అయితే ఈ సీజన్​లో మాత్రం ఐసోలేషన్ వరకే నిబంధనలు పెట్టిన బీసీసీఐ.. 2020-21లో లాగా బయో బబుల్​లో ఆడించే ఆలోచనలో లేదని బీసీసీఐ వర్గాల టాక్​. భారత్​లో కరోనా, ఇన్‌ఫ్లుయెంజా కేసుల కలకలంతో బీసీసీఐ కూడా అప్రమత్తంగా ఉందని.. పాజిటివ్ సోకినా లేక లక్షణాలున్న క్రికెటర్లను కచ్చితంగా ఏడు రోజులు ఐసోలేషన్​లో ఉంచనున్నట్లు బీసీసీఐ చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇక ఈ సీజన్​లో పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను మ్యాచ్​లు ఆడేందుకు అసలు అనుమతించరని తెలిపారు. అయితే ఐసోలేషన్​లో ఉన్న క్రికెటర్​ ఐదో రోజు తర్వాత మరోసారి కొవిడ్​ టెస్ట్​ చేయించుకుని అందులో నెగిటివ్ రిజల్ట్​ వస్తే అప్పుడు ఆడనిస్తామని అన్నారు.

బబుల్స్​లో ఐపీఎల్​ ఆట!
2020 కరోనా కల్లోలం సృష్టించిన వేళ ఆ ఏడాది ఐపీఎల్​ సీజన్​ను అత్యంత జాగ్రత్తల నడుమ కఠినమైన బయో బబుల్స్​లో నిర్వహించింది బీసీసీఐ. కానీ అప్పుడు మ్యాచ్​లు సగం కూడా పూర్తవ్వకముందే పలు ఫ్రాంచైజీల ప్లేయర్లకు కొవిడ్​ 19 సోకింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్​ను అర్థంతరంగా రద్దు చేసింది. కానీ 2021-22లో మాత్రం అటువంటి పరిస్థితులు మళ్లీ రాకుండా జాగ్రత్తపడింది. ఇక 2019 తర్వాత బీసీసీఐ మళ్లీ హోం అండ్ అవే సిస్టమ్​ను ఐపీఎల్​లో తీసుకురానుందట. ఇకపై కేసుల పెరుగుదల వల్ల ఐపీఎల్​ను నిలిపివేసే దుస్థితి కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుందట.

కరోనా విజృంభించిన సమయంలో ఆ వైరస్ సోకిన ఆటగాళ్లను మైదానంలోకి అడుగుపెట్టనివ్వలేదు బీసీసీఐ. అయితే ఈ వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత పలు నిబంధనలకు మార్పులు చేర్పులు చేశారు. కొవిడ్ టెస్టుల్లో పాజిటివ్​ వచ్చిన ఆటగాళ్లను సైతం గేమ్​ ఆడించారు. అలా పాజిటివ్​ రిజల్ట్​తో ఆడిన తొలి క్రికెటర్ ఆసీస్​ టీమ్​కు చెందిన తహీలా మెక్‌‌గ్రాత్. కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా గతేడాది భారత్​తో జరిగిన మ్యాచ్​లో ఆమె ఆడింది. ఇక మెక్‌గ్రాత్ తర్వాత మాథ్యూ వేడ్, రెన్షాలు కూడా పాజిటివ్ అని తెలిసినప్పటికీ మైదానంలో జట్టు తరఫున ఆడారు.

ABOUT THE AUTHOR

...view details