తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023: టాస్​ గెలిచిన కోల్​కతా.. బ్యాటింగ్ ఎవరంటే? - కోల్​కతా నైట్ రైడర్స్​ పంజాబ్ కింగ్స్ మ్యాచ్​

ఐపీఎల్ 2023లో భాగంగా రెండో మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​లో భాగంగా ముందుగా కోల్​కతా నైట్ రైడర్స్​ టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్​ బ్యాటింగ్​కు దిగనుంది.

IPL 2023 Punjab Kings vs Kolkata Knight Riders 2nd Match
IPL 2023: టాస్​ గెలిచిన కోల్​కతా.. బ్యాటింగ్ ఎవరంటే?

By

Published : Apr 1, 2023, 3:05 PM IST

Updated : Apr 1, 2023, 6:32 PM IST

ఐపీఎల్ 2023లో భాగంగా రెండో మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​లో భాగంగా ముందుగా కోల్​కతా నైట్ రైడర్స్​ టాస్​ గెలిచి ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పంజాబ్​ బ్యాటింగ్​కు దిగనుంది.

తుది జట్టు:

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్​), ప్రభ్‌ సిమ్రాన్ సింగ్(w), భానుకా రాజపక్సే, జితేశ్​ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కరణ్​, సికందర్ రాజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్​), మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా(కెప్టెన్​), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

కొత్త కెప్టెన్సీలో.. శ్రేయస్‌ అయ్యర్ గాయం కారణంగా కేకేఆర్​ జట్టుకు దూరమవ్వడంతో నితీశ్ రాణాను సారథిగా ఎంపిక చేసింది ఫ్రాంచైజీ. 2018 నుంచి జట్టులో ఉన్న అతడు ఈ సారి కెప్టెన్​గా తన సత్తా చాటడం ఎంతో కీలకం. అలానే దేశవాళీలో ప్రముఖ కోచ్‌గా వ్యవహరించిన చంద్రకాంత్‌ పండిత్‌ కేకేఆర్‌ జట్టులో ఉండటం కలిసొచ్చే అవకాశం. అఫ్గాన్‌ బ్యాటర్ రహ్మానుతుల్లా గుర్బాజ్‌తో పాటు వెంకటేశ్‌ అయ్యర్ ఓపెనింగ్‌లో కీలకంగా వ్యవహరించనున్నారు. గత సీజన్‌లో ఫెయిల్ అయిన ఆండ్రూ రస్సెల్‌ ఈసారి సత్తా చాటాలని కోల్‌కతా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి కూడా గతేడాది పెద్దగా రాణించకపోయినా అతడి ప్రదర్శనపై కోల్‌కతా ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించగల రస్సెల్‌ తిరిగి ఫామ్‌లోకి వస్తే మాత్రం కోల్‌కతాకు అస్సలు తిరుగుండదు. బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్, టిమ్‌ సౌథీ, సునీల్ నరైన్, ఉమేశ్‌ యాదవ్​తో బలంగా ఉంది.

పంజాబ్​ కూడా సేమ్​... గత సీజన్‌లో కెప్టెన్​గా ఉన్న మయాంక్‌ అగర్వాల్‌ను వదిలేసి.. ఈ సారి కొత్త కెప్టెన్​, టీమ్​ఇండియా సీనియర్ ప్లేయర్​ శిఖర్ ధావన్​తో బరిలోకి దిగనుంది పంజాబ్‌. మినీ ఆక్షన్​లో భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్ (రూ. 18.50 కోట్లు)పై పంజాబ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక కగిసో రబాడ లేకపోవడంతో బౌలింగ్‌ విభాగం కాస్త వీక్​గా కనిపిస్తోంది. భారత బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌పై కూడా పెద్ద బాధ్యత ఉండనుంది. టీమ్‌ఇండియాపై వన్డే సిరీస్‌లో అదరగొట్టిన నాథన్‌ ఎల్లిస్‌ ఉండటం పంజాబ్‌కు కలిసొచ్చే అవకాశం. భారీ షాట్లు ఆడే లియామ్‌ లివింగ్‌స్టోన్ అందుబాటులో లేకపోవడం వల్ల జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజా ఎలా ఆడతాడో చూడాలి. మొత్తంగా ధావన్, షారుఖ్‌ ఖాన్, భానుక రాజపక్స, జితేశ్‌ శర్మ బ్యాటింగ్‌ బలంగానే ఉంది. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.

ఇదీ చూడండి:IPL 2023 : గుజరాత్​కు బిగ్​ షాక్​.. సీజన్​ మొత్తానికి కేన్​ మామ దూరం!

Last Updated : Apr 1, 2023, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details