ఐపీఎల్ 16వ సీజన్ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడగా.. 5 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు గుజరాత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదిరే ఆరంభం దక్కినట్టైంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ (92) దంచికొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మన్ గిల్ (63) అద్భుత ప్రదర్శన చేశాడు. గిల్‌కు సపోర్ట్‌గా మిగతా బ్యాటర్లు కూడా తలో చేయి వేశారు. చెన్నై ఇచ్చిన టార్గెట్‌ను.. గుజరాత్ టైటాన్స్.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌నే విజేతగా నిలిచింది. వృద్ధిమాన్ సాహా (25; 16 బంతుల్లో), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (22; 17 బంతుల్లో), విజయ్ శంకర్ (27; 21 బంతుల్లో), రషీద్ ఖాన్ (10 ), రాహుల్ తెవాతియా (15 ) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రాజ్యవర్ధన్ హంగార్గేకర్ (3), రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92 పరుగులు; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాది త్రుటిలో శతకం మిస్ చేసుకున్నాడు. మొయిన్ అలీ (23; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబె (19), ధోనీ (14), అంబటి రాయుడు (12), బెన్ స్టోక్స్ (7) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమి తలో రెండు వికెట్లు తీయగా.. లిటిల్ ఒక్క వికెట్ తీశాడు.