ఐపీఎల్ 2023 ఎడిషన్ గ్రాండ్‌గా ప్రారంభమైపోయింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ఆరంభంకానుంది. ఈ సందర్భంగా అభిమానులతో నరేంద్ర మోదీ స్టేడియం నిండిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన గుజరాత్.. ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.
గుజరాత్ జట్టు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమి, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
ఇంపాక్ట్ ప్లేయర్స్:సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, అభినవ్ మనోహర్, మోహిత్ శర్మ, కేఎస్ భరత్
చెన్నై సూపర్ కింగ్స్: ధోనీ(కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:సుభ్రాంశు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, షేక్ రషీద్, అజింక్యా రహానే, నిశాంత్ సింధు
గ్రాండ్‌గా ప్రారంభోత్సవ వేడుక.. ఐపీఎల్ -16 సీజన్ ఆరంభ వేడుకలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సీనియర్ నటి మందిరా బేడి ఐపీఎల్ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఈ ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. ఆడియెన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు.
ఇక హీరోయిన్ రష్మిక మంధాన, తమన్నా స్టేజ్‌పై తెలుగు పాటలకు చిందులేసి ఆడియెన్స్‌లో జోష్ నింపారు. 'పుష్ప' సినిమాలోని 'సామి సామీ', 'శ్రీ వల్లి' పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది రష్మిక. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు కూడా నృత్యం చేసి అలరించింది. మరో హీరోయిన్ తమన్న భాటియా.. వివిధ భాషల పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ప్రేక్షకులను తెగ అలరించింది. టాలీవుడ్ సినిమా 'పుప్ప'లోని 'ఊ అంటావా మావ' పాటకు చిందులేసింది.
కామెంటేటర్‌గా బాలయ్య.. నందమూరి బాలకృష్ణ.. ఈ ఐపీఎల్ 2023 ఓపెనింగ్ మ్యాచ్ కోసం కామెంటేటర్ అవతారం ఎత్తారు. ఇందుకోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ బాక్స్‌కు చేరుకున్నారు. ఓ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ కోసం బాలయ్య కామెంటేటర్‌గా మారడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి:IPL 2023: కెప్టెన్స్ సూపర్ క్రేజ్.. ధోనీ రూ.1030 కోట్లు.. మిగతా సారథుల వ్యాల్యూ తెలుసా?