తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ బౌలింగ్ ప్రాక్టీస్​.. ఈ సారి IPLలో ఏం అద్భుతం చేయబోతున్నాడో?

ఐపీఎల్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ.. తన ప్రాక్టీస్​లో మరింత వేగం పెంచాడు. ఈ సారి నెట్స్​లో బౌలింగ్ చేస్తూ కనిపించి ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్​ చేశాడు. చూడాలి మరి ఈ సారి ఏం అద్భుతం చేయబోతున్నాడో..

IPL 2023 Dhoni Bowling practice video viral
ధోనీ బౌలింగ్ ప్రాక్టీస్

By

Published : Mar 24, 2023, 7:01 PM IST

Updated : Mar 25, 2023, 11:42 AM IST

ఐపీఎల్ 2023 కొత్త సీజన్​ మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్స్​.. ప్రాక్టీస్​ కూడా ప్రారంభించేశారు. నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రాక్టీస్​ చూసిన అభిమానులు సర్​ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే అతడు ఈ సారి ప్రాక్టీస్ సెషన్​లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అతడు ఈ సీజన్​లో బౌలింగ్‌ కూడా చేయబోతున్నాడా అనే అనుమానం ఫ్యాన్స్​లో కలుగుతోంది. మరి ఈ సీజన్‌లో అతడు ఏం అద్భుతం చేయబోతున్నాడో తెలీదు కానీ.. చెపాక్‌ స్టేడియంలో మాత్రం బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ అలరిస్తున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్​(సీఎస్కే) ఫ్రాంఛైజీ తన సోషల్​మీడియా ఇన్‌స్టాగ్రామ్​ అకౌంట్​లో పోస్ట్‌ చేసింది. వాస్తవానికి మహీ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంతాడు. ఇది క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన విషయమే. కానీ, అతడు బంతిని గింగిరాలు తిప్పుతూ బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ చూడలేదు! అందుకే ఈ వీడియో ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్స్​, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇక ఈ బౌలింగ్​ వీడియో చూసిన అభిమానులు చెన్నై కింగ్స్​ టీమ్​ పట్ల తనకున్న నిబద్ధతను, కష్టపడేతత్వాన్ని ప్రతిబింబిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్​ అని మరికొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఈ వీడియోపై సీఎస్‌కే మాజీ ప్లేయర్​ షేన్‌ వాట్సన్‌ కూడా స్పందించాడు. మహీ చాలా ఫిట్‌గా ఉన్నాడని.. అతడు మరో నాలుగేళ్ల వరకు అభిమానులను అలరించగలడని అభిప్రాయపడ్డాడు.

కాగా, సీఎస్కే.. ఇప్పటివరకు నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఈ సారి కూడా ఎలాగైనా టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. దీనికోసం ఆక్షన్​లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అందుబాటులో లేని దీపక్‌ చాహర్‌ను తిరిగి దక్కించుకుంది. అలానే గాయం కారణంగా గత సీజన్‌లో కొన్ని మ్యాచులకు దూరమైన రవీంద్ర జడేజా కూడా ఈ సీజన్‌లో ఆడనున్నాడు. మొత్తంగా టాలెంట్​ ప్లేయర్స్​తో బలంగా ఉన్న ఈ జట్టుపై అభిమానులు కూడా అంచనాలను ఎక్కువగానే పెట్టుకున్నారు. ఈ సారి ఎలాగైనా తమ అభిమాన జట్టు ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తున్నారు. ఈ ఐపీఎల్​.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్​తో మార్చి 31న ప్రారంభంకానుంది. చూడాలి మరి సీఎస్కే ఈ సీజన్​ను విజయంతో ప్రారంభిస్తుందో లేదో.

ఇదీ చూడండి:వారం రోజుల్లోనే IPL.. ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు.. ఎవరెవరు దూరమయ్యారంటే?

Last Updated : Mar 25, 2023, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details