ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది మెగాలీగ్ సీజన్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్‌లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో అతడిని రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) జరుగుతోంది. అయితే ఈ టోర్నీలో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోష్ లిటిల్ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.