IPL 2023 Auction Date: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2023కు సంబంధించి సూపర్ అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎస్ సీజన్ కోసం బీసీసీఐ.. వేలం పాట వేదికను, తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
IPL 2023 సూపర్ అప్డేట్.. మినీ వేలానికి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? - ఐపీఎల్ 2023 అప్డేట్లు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుతున్న వేళ.. ఐపీఎల్ 2023 వేలానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2023కు సంబంధించిన వేలం పాట వేదికను, తేదీని ఖరారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆ వివరాలు..
ఇది వరకు వార్తలొచ్చినట్లుగా ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలంపాటను నిర్వహించడానికి తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌కు వెళ్లట్లేదు బీసీసీఐ. స్వదేశంలోనే దీన్ని నిర్వహించనుంది. గతేడాది సిలికాన్ సిటీ బెంగళూరులో వేలం నిర్వహించిన బీసీసీఐ.. ఈ సారి ఆక్షన్‌కు కేరళలోని కొచ్చి నగరాన్ని వేదికగా ఖరారు చేసిందట. డిసెంబర్ 23వ తేదీన వేలంపాటను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న పది ఫ్రాంఛైజీల వద్ద 90 నుంచి 95 కోట్ల రూపాయల బ్యాలెన్స్ మిగిలివుంది. ఈ మొత్తంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఫ్రాంఛైజీలవారీగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్- రూ.3.45 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్- రూ.2.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్- రూ.95 లక్షలు, గుజరాత్ టైటాన్స్- రూ. 15 లక్షలు, ముంబయి ఇండియన్స్- రూ.10 లక్షలు, సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.10 లక్షలు, దిల్లీ కేపిటల్స్ - రూ.10 లక్షల రూపాయల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఒక్క లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పర్స్‌లో మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంది.