ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కష్టకాలం ఎదురయినప్పటికీ ఉన్న నలుగురు పవర్ఫుల్ పేసర్లతోనే సీజన్‌ను నెట్టుకొచ్చింది. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లు విజృంభించగా.. మిడిల్ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, మార్కో జాన్సెన్, ఫజల్హాక్ ఫరూఖీలు చెలరేగిపోయారు. అయితే స్పిన్ టీమ్ మాత్రం ఎస్ఆర్హెచ్కు ఏమాత్రం బలం చేకూర్చలేకపోయింది.
ఆ మూడు కష్టాలను గట్టెక్కించిన సన్‌రైజర్స్.. ఇక 2023 ఎలా ఉండనుందో మరి ??
ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ప్లేయర్లను ఎంచుకునే విషయంలో ఆచీతూచీ వ్యవహరించింది. డిసెంబర్ 23న జరిగిన ఈవెంట్లో నలుగురు ఓవర్సీస్ ఆటగాళ్లతో పాటు మొత్తం 13మందిని కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలం ద్వారా సన్‌రైజర్స్ ఓ మూడు బలహీనతలను అధిగమించిందని చెప్పొచ్చు.
అప్పుడున్న వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్‌లతో స్పిన్ విభాగాన్ని ఓ మేర మేనేజ్ చేయగలిగారు. దీంతో ఈ సారి వేలంలో ఆచితూచి అడుగులేస్తూ ఆరుగురు ప్లేయర్లను ఎంచుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2023లో ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, అకీల్ హోస్సెన్‌లను తీసుకొని ఆ బలహీనతకు చెక్ పెట్టింది. దేశవాళీలో రాణించిన వివ్రాంత్ శర్మను సన్‌రైజర్స్ కొనుగోలు చేయగా.. అతడు పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా జట్టుకు ఉపయోగపడనున్నాడు.
2022 సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠిలు సన్‌రైజర్స్ మిడిలార్డర్లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. కానీ ఈ విషయంలో పూరన్ విఫలమ్వవడం వల్ల జట్టు గెలుపునకు ఆటంకంగా మారింది. దాని వల్ల అతడిపై వేటు వేసిన సన్‌రైజర్స్ ఆ లోటును హెన్రీచ్ క్లాసెన్‌తో పూర్తి చేసింది. మరోవైపు హరీ బ్రూక్‌ను టీమ్‌లో జాయిన్ చేసి బ్యాటింగ్‌కు మరింత బలం చేకూరేలా చేసింది. మయాంక్ అగర్వాల్ రాకతో టాప్ ఆర్డర్ కూడా మరింత పటిష్ఠంగా మారింది. బ్యాకప్‌లో గ్లేన్ ఫిలిప్స్ ఉండటం జట్టుకు ఇంకాస్త ధైర్యం వచ్చింది.
అయితే గత సీజన్లో కేన్ విలియమ్సన్ జట్టును నడిపించినప్పటికీ.. ఎస్ఆర్హెచ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అతడి స్థానంలో మరొకరిని తదుపరి కెప్టెన్‌గా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కొత్త జట్టుతో ఇక ఈ 2023.. సన్‌రైజర్స్‌కు ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు