తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీ, వేదికలు ఖరారు! - ఐపీఎల్ 2022 లేటెస్ట్ న్యూస్

ఐపీఎల్ 2022 ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లీగ్​ను మార్చి 27 నుంచి నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ అధికారి తెలియజేశారు.

IPL 2022 starts date, ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీ
IPL 2022

By

Published : Jan 22, 2022, 6:17 PM IST

ఐపీఎల్ 2022 కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరుతుండటం వల్ల ఈ లీగ్​పై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కాగా ఓ బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మార్చి 27 లేదా ఏప్రిల్ 2న ఈ లీగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిపై బోర్డు త్వరలోనే స్పష్టత ఇవ్వనుందట.

ఒకే వేదికలో..

కరోనా కారణంగా గతేడాది యూఏఈలో లీగ్ నిర్వహించారు. కాగా.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్​లోనే టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశారు. దీనిపైనే ప్రస్తుతం చర్చలు జరుపుతోంది బోర్డు. ముంబయిలోని వాంఖడేతో పాటు డీవై పాటిల్ స్టేడియంలో పూర్తి లీగ్​ను నిర్వహించాలని చూస్తోంది. ఒకవేళ రెండు మైదానాలు సరిపోకపోతే పుణె స్టేడియంలో మరికొన్ని మ్యాచ్​లను జరపాలని బోర్డు భావిస్తున్నట్లు ఓ అధికారి తెలియజేశారు.

రేసులో యూఏఈ, దక్షిణాఫ్రికా

ఒకవేళ భారత్​లో కరోనా పరిస్థితి మరింత దిగజారితే లీగ్​ను యూఏఈలో లేదా దక్షిణాఫ్రికాలో నిర్వహించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. శ్రీలంక పేరు మాత్రం ఇప్పటివరకైతే చర్చకు రాలేదని తెలుస్తోంది.

ఈ సీజన్​కు సంబంధించిన మెగావేలం ఫిబ్రవరి 12, 13న జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 1,214 మంది క్రికెటర్లు ఈసారి వేలంలో భాగం కానున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: IPL Mega Auction: ఏ ఆటగాళ్లు ఏ జాబితాలో ఉన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details